ఈ పుట ఆమోదించబడ్డది

స్నేహితుల కాహ్వానము

237

రాజా: ఇటుకలు పోతపోసే ఇంజనీర్లకన్న వైద్యులు నయమోయ్.

ఆలం: రెండూ రెండే. ఒకడు నాచేతిమాత్ర వైకుంఠయాత్ర అంటాడు. రెండోవాడు నేకట్టిన వంతెనా అదిబద్దలయి నీళ్ళలో గంతెనా!

రాజా: కొంపలు మాపే తమ లాయరుద్యోగం చాలా గొప్పది కాబోలు. ఏమి ఎరగనివాళ్ళకు తలలుమార్చడాలు నేర్పి, సంసారాలు దిబ్బచేసే దెవరో?

నట: మీరంతా ఒకటేదా. మా రైతుల రక్తం పీల్చటానికిదా పుట్టారు. మీరు మాదేశంలో ప్రవేశించిన చీడపురుగులువంటివాళ్లుదా.

రాజా: ఈ అసలైన రైతుబిడ్డ ఈ నటరాజన్ ఏమి బాగా మాట్లాడుతున్నాడు. ఒరే రైతూ! నీ తెలివితక్కువతనాన, నీశక్తి లేకపోవడం మూలాన పరరాజ్యాలవాళ్లు వచ్చి మనదేశం ప్రవేశించడం, మనలందరినీ రక్తం పీల్చడం జరిగింది. ఓరీ అరవరైతూ.

ఆలం: అచ్ఛా అచ్ఛా, బహుత్ అచ్ఛాహై! సుల్తాన్‌వారి ఆజ్ఞ హేమిటి చెప్తారఱ్ఱా!

రాజే: నేనురావడం సుతరామూ వీలులేదు.

ఆలం: అయితే ఒక సంగతి చెప్తాను వినండి. మనవాళ్ళకి నేను ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంటాను. వాళ్లు ఎప్పుడు హైదరాబాదు వస్తారో అప్పుడంతా హైదరాబాదు వెళ్ళి కలుసుకుందాము. అక్కడ చూడవలసినవి చూసి, ఒరంగల్లు, పాలంపేట చూసి అందరం బెజవాడ వద్దాము. ఏమంటారు?

రాజే: తురకాడు తురకాడేరా! హైదరాబాదులో మనవాళ్లని కలుసుకోవాలేం? షరం నహీహై?

ఆలం: హహ్హహ! ఎక్కడ నేర్చుకున్నావురోయి తురకం?

రాజే: నాకు వచ్చిందోయి, రాజేశ్వరులవారికి ఇబ్బంది లేదు, ఎటువచ్చీ నటరాజన్ గారిని మనం యిబ్బంది పెడ్తాం

నట: నువ్వు రావడందా, హాజరుదా?

రాజేశ్వరరావు మేఘాలమీద రాజమండ్రిలో వ్రాలినాడు. వచ్చినప్పటి నుండియు పుష్పశీలయే కలవరింత! ఆమె నెట్లు కలుసుకొనుటా యను విరహ వేదనయే.

రాజేశ్వరుడు చదువుకొనురోజులలో పుష్పశీలకడనుండి యుత్తరములు చిత్రముగా తెప్పించుకొనువాడు. తానొక స్నేహితునికి వ్రాసి యచ్చటనుండి యొక బాలకునిచే నామెకా ఉత్తరము ఆందునట్లు చేయువాడు. ఆమె తన ఫొటోలు రెండు అతనికి బంపినది, వానిని దాస్ బ్రదర్సు వారికడ నలభై