ఈ పుట ఆమోదించబడ్డది

బృందావనము

229

ఈపవిత్ర ప్రదేశముల భగవంతుడు శ్రీకృష్ణుడు చరించినాడు. పాండవులు, కౌరవులు రాజ్యమునకై పెనంగినారు. మహాభారత మంతయు వారి మనోనేత్రములకు గోచరించినది. కురుక్షేత్రమున అభిమన్యు యుద్ధమును స్మరించి మన యాత్రికులు కన్నుల దడిపికొనిరి.

బృందావనములో వారికి మీరాకథ స్మరణకు వచ్చినది.

‘పురుషు డెవ్వం డిచట?
పురుషు డాత డొకండె పురుషోత్తముండు.
పురుషు డాత డొకండె
పొలతులము మనమంత,
దివ్యపురుషుని ప్రేమ
తేజఃప్రదీప్తులము,
పురుషు డెవ్వం డిచట?
నాథు పాదాలపై
నా బ్రతుకుపువు నుంతు
పూజ గైకోవేర
పొలతులను బ్రోవరా!
పురుషు డెవం డిచట?

అని పరమేశ్వరుడు పాడినాడు.


౮ ( 8 )

బృందావనము

స్నేహితుల కిరువురకు మీరాబాయి దివ్యచరిత్రము కనుల గట్టినది. మీరాబాయి శ్రీకృష్ణుని కొనియాడుచు బృందావనము వచ్చినది. అప్పుడు బృందావనమున కొక మహాత్ముడు వచ్చియుండెను. ఆ స్వామి తానున్నంత కాలము బృందావనములోనికి స్త్రీలను రానియ్యవలదని యాజ్ఞనిడుటయు, ప్రజ్ఞావంతుడగు నా సన్యాసియాజ్ఞ పూర్ణముగా నిర్వర్తింపబడుచున్నది. ఇంతలో మీరాదేవి బృందావనము ప్రవేశింపబోవుచుండ ‘నిలు నిలు’ మని అడ్డగించినారు.

‘ఎందుకు నాయనా ఆపుజేశారు?’

‘తల్లీ! నువ్వు స్త్రీవి. బృందావనములో ప్రవేశించ వలనుపడదని మా గురువు గారి ఆజ్ఞ.’

‘మీ గురు వెవరూ?’