ఈ పుట ఆమోదించబడ్డది

నారాక కాటంకములుగలిగించినవి. పయనమేడుదినములు పట్టుటచేతను బాధలు మిక్కిలిపడవలసివచ్చుటచేతను రాజాలనైతిని. కావున నాయెముకలుగోతిలో బడకమున్నె మీరే తాల్వెండీగ్రామ మొక్కసారి వచ్చి నాకు దరిశనమిచ్చి నన్ను ధన్యుని జేయవలయునని కోరుచున్నాను. "ఆసందేశము మిక్కిలి జాలిగొలుపునదై యుండుటచేతను తనమీద మొదటినుండియు నభిమానముగలిగి తనకెన్నో యుపకారములు చేసిన రాయబులారువద్దనుండి యాసందేశము వచ్చుటచేతను నానకు దానినిజులకనగ జూడలేకపోయెను. అందుచేత బలుడు మర్దనుడు జేరిన దినముననే నానకు లల్లోవద్ద సెలవుపుచ్చుకొని యమ్నాబాదు విడచి తాల్వెండికి బోవదలచెను.

తలచెనుగాని పయనము గావలసి వచ్చినప్పుడు వాని మనస్సు మిక్కిలి సందేహించెను. రాయబులారుమీది విశ్వాసముచేత ననుగ్రహముచేత స్వగ్రామ దర్శినము వానికిష్టమైనను వాని మనస్సునకు మిగుల బాధను కలిగించునట్టివియు మనోధైర్యమును సంపూణన్‌ముగా శోధింప గల్గినట్టివియునగు స్థితిగతు లక్కడ నున్నట్లు వానికి బొడగట్టెను. ఎవ్వని గూర్చి గురునానకప్పటికిని భయపడుచుండెనో యాకాళుడక్కడ నుండెను. దయామయస్వరూపిణియు గన్నతల్లియునగు త్రిప్తాదేవియు నక్కడనే యుండెను. కోపోద్దీపితుడగు తండ్రి కఠోరభాషణముల నత డొకవేళ సైరించి సరకుసేయ