ఈ పుట ఆమోదించబడ్డది

సారమున వెండియు బ్రవేశించి యుండకూడదా యని కొంత లేనిపోని యాసపెట్టుకొని మర్దనుడు గ్రామమునకు రాగానే బలునికంటె వాడు బుద్ధిమంతుడని భావించి వాడు సుతుని విషయమున నేదైన మేలువాతన్ చెప్పునేమోయని భ్రమపడి వానినిం గలిసికొని నానకు వైరాగ్యమునుగూర్చి యనేకప్రశ్నము లడిగెను. తనయునిగూర్చి కాళుడు విన్నదంతయు యధార్థమని మర్దనుడు ప్రత్యుత్తరము చెప్పెను. అది విన్నతోడనే కాళునియొడలు జల్లుమనెను. మొగము తెల్లవారెను. మర్దనుడు కాళునిమాటలకు బదులుచెప్పునప్పుడు నిర్భయముగను జ్ఞానగర్భితముగను మాటలాడెను; మొదట కాళుడే తనయునివాతన్ యరసివచ్చుటకు మర్దనుని బుత్తెంచెనని చదువరు లెఱుంగుదురుగదా! మర్దనుడు తన యుదరపోషనార్థము గానవిద్య నేర్చుకొన్నవాడయ్యు గురునానకుతో గొన్నినాళ్లు సహవాసముచేయు నప్పటికి వానికిస్వలాభ పరాయణత యైహికవిషయాసక్తిదవ్వులయ్యెను. పారమార్థిక చింతప్రబలెను. తనవలెనే పుత్రుడు సంసారతంత్రములో దగుల్కొని నట్లు చేయవలయునని ప్రయత్నించుచున్న కాళునిచేష్టలయందతని కేవ గలిగెను. దయాళువు లోకబాంధవుడు నగు భగవంతుడు డొకడున్నవాడనియు వానిసేవయేమానవునకుప్రథమకృత్యమనియు నతడు తెలిసికొనెను. తెలిసికొని తన్ను పంపినయజమానికంటె మర్దనుడు జ్ఞానియయ్యె నానకుయొక్క ని