ఈ పుట ఆమోదించబడ్డది

4

నానకు చరిత్ర.

యినను దైవభక్తి భూతదయ జిత్రేంద్రియత్వము బాల్యమునం దంకురించి నానాట నభివృద్ధి జెందును. ఇట్టి సత్పురుషులే పరోపకార పరాయణులై జీవితమంతయు పరమార్థమునకు ధారపోయుదురు. ఈనానకు పుట్టినప్పు డద్భుతములతో బుట్టకున్నను యుక్త వయస్కు డైన పిదప భక్తాగ్రగణ్యుడయ్యె.

హిందువులలో బుత్రసంతానముగలుగుట పరమానందహేతువు. అదివఱకు పుత్రసంతానము లేని పురుషునకు గుమారుడు గలిగినప్పు డాకుటుంబమునకు బొడము నానందము నెవడు వర్ణింపగలడు! పున్నమినాటిరాత్రి బుత్రుడుకలుగుటయు మరనా డుదయమున గాళునిగృహము మహానందనిలయమైయుండెను. కాళున కదివఱకొక కూతురుండెను. ఎంద రాడుబిడ్డలున్నను హిందువులలో మగబిడ్డలులేని మనుష్యుడు కేవలము మందభాగ్యుడుగ నెంచబడుటచే గాళుడు పుత్రోత్పత్తియైనతోడనే తాను ధన్యుడనయితినని తలంచి సంతోషపరవశుడై తక్షణము పురోహితుంబిలిపించి బాలుని భవిష్యద్దశను గూర్చిమున్నె యెఱుంగవలయునని జాతకము వ్రాయుమని కోరెను. ఇట్లు పురోహితుం బిలిపించి జాతకము వ్రాయుమనుటలో గుమారుని జాతక మఖండైశ్వర్యవంతముగ నుండుననియె తండ్రి యభిప్రాయము. జ్యోతిష్కుడును బరేంగితజ్ఞానము కలవాడు కావున దండ్రియను