ఈ పుట ఆమోదించబడ్డది

మిచ్చి యీక్రిందివిధమున బలికెనట. "నే నూరకుంటినా నన్ను జ్ఞానములేని మొద్దందురు. మాటలాడితినా ప్రేలు చున్నాడందురు. కూర్చుంటినా యెవనికొఱకో యేడ్చినట్లే యున్నాడందురు. లేచిపోతినా నెత్తినిగుడ్డవేసికొని పోయినాడందురు. వినయము జూపితినా భయపడి లోబడినాడందురు. నీజనుల నెట్లుమెప్పింపవలయునో నే నెఱుగను. భగవంతుడే నన్నిహపరముల రక్షించుగాక." "లోకోభిన్నరుచి:" యను సామెతనుబట్టి మనుష్యుల మనస్సులు పరిపరి విధములుగ నుండును. ఒకనికి మిక్కిలి బాగున్నది మఱియొకని కెంతో యోగుగా గానబడును. అందఱ మెప్పించుట మనుష్య మాత్రున కెవ్వనికిం దరముగాదు. కావున లోకోపకారపారీణుడగు మనుష్యుడు తనకు సత్యమనిదోచిన దానిని లోకుల నిందల కుడుగక స్తోత్రముల కుబ్బక దైవముఖము జూచి నిర్భయముగ జాటును. గురునానకు తనయూరు విడచిపోవుట కిష్టపడక లల్లో మాసముదినములు తనయింట నుండుమని వానిని బ్రార్థించెను. అతడు మిక్కిలి వినయముతో వేడుకొనుట చేతను మిక్కిలి భక్తిగలవాడగుటచేతను నానకు వాని కోరిక నెరవేర్ప నియ్యకొనెను. మర్దనుడు పురజనులుపెట్టు బాధలు పడలేకను క్రొత్తయూరులో మునుపటియట్లు ప్రొద్దుపోవక పోవుటచేతను స్వగ్రామము పోవదలచి యజమానుని సెలవడిగెను. తనకాతిథ్యమిచ్చిన గృహస్థుడు సామాన్యస్థితికల