ఈ పుట ఆమోదించబడ్డది

లను సంఘమునుండి దూరముగ దోలుటకు నిర్మూలించుటకు సమకట్టె గావున నీతడు గురుబిరుదము నందుటకుదగినవాడు. అందుచేత నాశబ్ద మతనియందు సార్థకమయ్యెను.

సుల్తానుపురమునుండి యమ్నాబాదుకు బోవుట కేడు దినములు పట్టెను. ఈపట్టణమునకు నానకు వచ్చుటకు గారణమేమన నచ్చట దైవభక్తుడు సత్ప్రవతన్‌కుడు నగు వడ్ల వాడొక డుండెను. ఆతని జూచుటయే యీగురుని యభిలాష. ఆవండ్రంగి పేరు లల్లో. నానకు తత్పురము బ్రవేశించి సరిగ ఆవడ్రంగియింటికి బోయెను. లల్లో నానకు మహాత్ముడని వినియుండెనేకాని యాతని దరిశన మదివఱకెన్నడు జేసియుండలేదు. తనగృహమున కనాహూతుడై యరుదెంచిన పురుషుడు నానకేయని తెలిసికొని యావడ్రంగి మహానందభరితుడై వానినెంతయు గౌరవించెను. అతడక్కడ కొన్నినాళ్లుండి తనమతము బోధింప నారంభింప నాపురజనులకు వానిమీద ననిష్టముపొడమెను. అనిష్టమేకాదు కేవల ద్వేషమే కలిగెను. అట్లుకలుగుట యాశ్చర్యముగాదు. ఏలయన నేమనుష్యుడైన మతవిషయమునగాని, సంఘవిషయమునగాని, జ్యోతిషాది శాస్త్రవిషయములగాని క్రొత్తసిద్ధాంతము బోధించినప్పుడును సిద్ధాంతము ప్రాతదైనను నూతనముగా నాచరణమునకు దెచ్చినప్పుడును లోకులు కాకులట్లు వానిం బొడిచి తల యెత్తుకొననీయక నిందించి బహిష్కరించి దండించి