ఈ పుట ఆమోదించబడ్డది

దలయేరు గలిగించెను. పారమార్థికులు గాక గతానుగతికులైన మూడలోకులకు బుద్ధి చెప్పవలయునని తలంచి బలుని బిలిచి యచ్చటచెరువులోనుండి యొకచేపం దెమ్మని యతడు తెచ్చిన యామత్స్యమునుదాకలోబెట్టి మండింపదొడగెను. అదిచూడగానే తీర్థవాసులకు నతితీక్షణమైన కోపము వచ్చెను. అటువంటి పావనక్షేత్రమున పరమపావన చరిత్రులగు తీర్థవాసులు లక్షోపలక్షలు చూచుచుండగ నటువంటి పుణ్యదినమున యోగి యన్నపేరు పెట్టుకొన్నవాడు జీవహింస చేసి కడుపు నించికొనుటకన్న కష్టకార్యము మరొకటి లేదని యచ్చట చేరినవారందరు దలంచి కోపగించిరి. కొందఱు తమనాలుకలను యధేచ్ఛముగ నుపుయోగించి వానిని నోటికి వచ్చునట్లు బండబూతులు తిట్టిరి. అట్టి దురాత్ముని బ్రతుకనియ్య గూడదని దుడ్డుకర్రలు చేతబట్టుకొని చంపవచ్చిరి. వాని కాసమయమున నొడలే తెలియలేదు. పొంగి పొరలివచ్చుచున్న మహాసముద్రమువలె జనసమూహము తన్ను నిర్మూలనము జేయుటకు దుడ్డుకఱ్ఱలతో వచ్చి మీదపడుచున్నను నతడు మహాపర్వతమువలె చలింపక నిర్భయముగ వారిముందర నిలిచి మీరు వాగ్వాదము చేసి నన్ను గెలువ దలంచిరా లేక దండప్రయోగముచేతనే నిర్జింపదలచిరా యని యడిగెను. వర్షకాల మేఘము లురిమిన చందమున దమకంఠము లెత్తి వారిట్లనిరి. వాగ్వాదముచేసి నీతప్పు నీవు తెలిసికొని యికముం దట్టిపని