ఈ పుట ఆమోదించబడ్డది

చారించిన గార్యము లేదు. జీవించినయున్నవారిని జూడనక్కఱలే దని నానకు తన జన్మస్థానమున నొక్క రాత్రియైన సంపూణన్‌గ గడుపక శిష్యసమేతుడై వెడలెను.

ఈసారి గాంధార నగరమున కరుగవలయునని వారి సంకల్పము. గాంధారపురమున వసియించుచు సుప్రసిద్ధులైన బాబావలీ యను మహానుభావుని సందర్శింపవలయు నని యతడు బయలు దేఱెను. ఈదారి పలుమా ఱతనికాలిక్రింద నలిగినదే యగుటచేత గ్రామములు బురములు బరిచితములు. ఆమువ్వురును ముల్తాను మండలములోని తలంబాపట్టణము విడిచిన తరువాత గురువు బలునితో గూడి మెల్ల మెల్లగా వెనుకబోవుట కేర్పఱచుకొని ముందరియూరికి సజ్జదుని ముందుగాబంపెను. సజ్జదుడు కొంత దూరము పోవునప్పటికి వాని కొకయూరు కనబడెను. అచ్చట హిందువుల దేవాలయము మహమ్మదీయుల మసీదు నొక్క స్థలమందె యొకదానికొకటి చేరియుండెను. ఆమఠాధిపతి జనపనార పీచువలె మిక్కిలి తెల్లనై నాభీ వివరపర్యంతము వ్యాపించిన గడ్డము గలిగి వృద్ధు డనితెలియజేయుటకు మొగముమీద ముడుతలుగలిగి చూచినవారికి గౌరవభాజన మని తోచుచుండును. సజ్జదుడు గంభీరుడైన యాతనియాకారము చూచి భక్తితత్పరుడై యతని కభివాదము చేసి యతనితో బ్రసంగించెను. ఆవృద్ధుడు కొంతసంభాషణము జరిగినపిమ్మట వానిని భోజన