ఈ పుట ఆమోదించబడ్డది

అయితే తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు తమ గాడినుంచి తప్పిపోతున్నారని ఆందోళన చెందుతుంటారు. కాగా, యావనారంభ దశలో మాత్రం ఇది కొద్దికాలంపాటు కొనసాగుతుంది. వీరిలో తమ అభిరుచులు కలిసిన సమ వయస్కులలో ప్రత్యేక గుర్తింపు పొందాలనే తపన ఉంటుంది. సాహసాలకు పూనుకొనే ప్రవర్తన వీరిలో సామాన్యం. ఇతరులతో దెబ్బలాటలకు దిగడం కాని, స్నేహితులతో కలిసి ధూమపానం వంటి అలవాట్లకు లోనుకావడం కాని సాధారణంగా కనిపిస్తుంది.

మద్యం, మాదక ద్రవ్యాల సేవనం

ఇతరులు చేసే అన్ని రకాల పనులనూ తామూ చేయాలనే కోరిక వీరిలో ఉంటుంది. ఒక అనుభవం కోసం వారు ఇతరుల ప్రవర్తనను లేదా అలవాట్లను అనుకరించడానికి యత్నిస్తారు. ఉదాహరణకు ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల సేవనం మొదలైన వాటికి సులభంగా లోనవుతారు. అయితే అత్యధికులు వీటిని త్వరితంగానే వదలివేయగలుగుతారు.


శారీరక మార్పులు

యావనారంభ దశలో అనేక రకాలైన శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎత్తు పెరగడం, మగ పిల్లలకు మీసాలు గడ్డాలు రావడం, ఆడపిల్లల్లో ఛాతిలో చోటు చేసుకునే మార్పులు, రుతుక్రమం మొదలైన మార్పులు కనిపిస్తాయి. వీటి గురించి తల్లిదండ్రులు తమ పిల్లలను చైతన్యవంతం చేయనిపక్షంలో ఇవి వారిలో మానసిక వత్తిడికి కారణమవుతాయి.

సాహసాలకు పూనుకొనే ప్రవర్తన

యుక్త వయస్సులోకి అడుగిడుతున్న వారిలో కనిపించే అతి ముఖ్యమైన సమస్యలలో సాహసాలకు పూనుకొనే ప్రవర్తన ఒకటి. వాహనాలను ప్రమాదకర మైన రీతిలో నడపడం, తన స్నేహితుల మధ్య తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసమో లేదా అందులోని థ్రిల్ను అనుభవించడం కోసమో ప్రమాదకరమైన ○