పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/57

ఈ పుట ఆమోదించబడ్డది

చేయగూడని పాడుపనులు చేస్తుంటారు. లేదా ఏవేవో ముఖ్యంగాని చిల్లరమల్లర పనులతో కాలక్షేపం చేస్తుంటారు. మనకు ముందుపోయిన మహాపురుషులు వారి కాలాన్ని బంగారంలాగ వాడుకొని గొప్ప విజయాలు సాధించి పోయారు. పూర్వకాలమనే యిసుకమీద తమ పాద ముద్రలను నిల్పిపోయారు. గాంధి, నెహ్రూ, మదర్ తెరెసా ఈలాంటివాళ్లు, సమయాన్ని వినియోగించుకోవడంలో వీళ్లు మనకు ఆదర్శం కావాలి.

ఒక బ్యాంకు రోజూ మనకు వేయి రూపాయలు ఇస్తుందనుకొందాం. కాని మనం ఆ సొమ్ములో ఆ రోజు ఖర్చుచేయని దాన్ని బ్యాంకు తిరిగి తీసికొంటుంది అనుకొందాం. అప్పుడు ఆ సొమ్మని ప్రతిరోజు తప్పకుండ ఖర్చుచేస్తాం గదా! భగవంతుడు మనకు రోజూ 24 గంటలూ, 1440 నిమిషాలూ ఇస్తున్నాడు. ఏరోజైనా మనం వాడుకోకపోతే ఈ నిమిషాలు నష్టమైపోతాయి. మరుసటి రోజుకి మిగిలివుండవు. ఐనా మనం ఆలోచన లేకుండ, సోమరితనంతో వీటిని నష్టపరుస్తుంటాం. ఎంత అవివేకం!

అంజు నాలుగేండ్లపాప. పొలంలో తండ్రితో నడుస్తుంది. ఆ ప్రక్కనే ప్రొద్దు తిరుగుడు పూవు కన్పించింది. తండ్రిని నాన్న ఆ పూవు క్ర్చో యివ్వ అని అడిగింది. నాన్న కోసి యిచ్చాడు. అంజు దాన్ని కండ్లవిప్పి చూచి, వాసన చూచింది. ఆ మీదట నాన్న దీన్ని మళ్లా అక్కడే పెట్టు అంది. త్రుంచిన పూవును మళ్లా మొక్కకు అతికించడం కుదరదు కదా! ఈలాగే పోగొట్టుకొన్న కాలాన్ని తిరిగి పొందలేం. కొండంత బంగారమిచ్చినా జరిగిపోయిన కాలంలో ఒక్క క్షణంకూడ తిరిగిరాదు. ఐనా మన యువత ముందు వెనుక ఆలోచించకుండ కాలాన్ని సులువుగా దుర్వినియోగం చేయడం బాధ కలిగిస్తుంది.

మనకున్న గొప్ప సంపదల్లో కాలంగూడ వొకటి. భగవంతుడు దీన్ని మనకు అరువుగా యిచ్చాడు. దీన్ని సక్రమంగా వాడుకొని విజయాలు సాధించడం మన బాధ్యత. మనం కాలాన్ని కొనలేం, అమ్మలేం. ఆస్తిని లాగ ఇతరుల పరం చేయలేం. దాన్ని వేగవంతమూ చేయలేర్తి, నిదానమూ చేయలేం. దాని వేగంతో