పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

నోచుకోలేదు కదా అని విచారిస్తారు. వాళ్లలాగ ప్రసిద్దులం కాలేము కదా అని బాధ పడతారు. తమ అవయవాల్లో ఏదైనా లోపముంటే అందరూ తమ వైపే చూచి ఎగతాళి చేస్తున్నారేమోనని ఉలిక్కిపడతారు. మనం అనుకొన్నట్లుగా ప్రక్కవాళ్లు మనలనేమీ పట్టించుకోరు. ఐనా యావనంలో యువత తలంచేతీరు ఈలాగుంటుంది. ప్రాయమొచ్చేకొద్ది ఈ భావాలు, భయాలు క్రమేణ తొలగిపోతాయి.

చాలమంది యువజనం శరీరాకృతి సుందరంగా లేకపోతే జీవితంలో విజయం సాధించలేము అని భావిస్తారు. కొంచెం వికారంగా వుంటే ఇతరులు తమ్మ అంగీకరించరనీ తమతో స్నేహం చేయరనీ బెంగపడతారు. కాని ఈ యభిప్రాయాలు సరికాదు. శరీరాకృతి మనం సాధించే విజయాలనూ, సంపాదించే స్నేహితులనూ నియంత్రించలేదు.

కొందరు యువతులు లావెక్క కూడదనీ సినిమా తారల్లాగ సన్నగా వుండాలనీ అర్ధతిండి తిని కడుపు కాల్చుకొంటారు. ఇది తప్పడు పద్ధతి. యవనంలో మంచి తిండి తింటేనే గాని శరీరం సక్రమంగా పెరిగి పుష్టిమంతంగా తయారు కాదు.

చాలవుంది యువతీ యువకులు తవురంగు బాగా లేదని బాధపడుతుంటారు. మన సమాజంలో తెల్లరంగుకి విలువ యొక్కువ. నలుపుకి విలువ తక్కువ. వేరు కొందరు తమ అవయవాల్లో ఏదో వొకటి చక్కగా లేదని విచారిస్తుంటారు. ఇవన్నీ అనవసరమైన ఆందోళనలు. ప్రాయం వచ్చి వొడలి పెరుగుదల పూర్తయ్యేకొద్ది తోడిజనంలాగ మనం కూడ కుదురుగానే వుంటాం.

కొద్దిమందిలో అవయవలోపం వుంటుంది. ఐనా పర్వాలేదు. ఈ లోపాన్ని చూచి సమాజం మనలను నిరాకరించదు. చరిత్రలో ప్రసిద్దులు చాలమంది అవయవలోపం కలవాళ్లే గాంధీకి పెద్ద చెవులు వుండేవి. నెపోలియన్ పొట్టి వాడు. అబ్రహాం లింకన్ వికారంగా వుండేవాడు. ఇంగ్లీషు కవి పోప్ కుంటివాడు.