పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

వుంటుంది. మామూలుగా లైంగిక విషయాలు వచ్చినపుడు జనం నవ్వుతారు. చులకన చేస్తారు. ఇది పొరపాటు, లింగం దివ్యమైంది.

2. నరుల్లో, జంతువుల్లో లైంగిక శక్తి

జంతువుల్లో ప్రకృతే లైంగిక క్రియను అదుపు చేస్తుంది. అవి రుతువు వచ్చినపుడు లైంగిక క్రియను ఆపుకోలేవు. రుతువు రానపుడు కొన్నిశృంగార చేష్టల ద్వారా లైంగిక క్రియకు సిద్ధం కాలేవు. ఈ విషయంలో సహజ జ్ఞానమే వాటిని నడిపిస్తుంది. నరుల పద్ధతి దీనికి భిన్నంగా వుంటుంది. మానవులు తమ భాగస్వామిని ఎన్నుకొంటారు. తమ యిష్టం వచ్చినపుడు లైంగిక క్రియ జరుపుతారు. రుతువుతో సంబంధం లేకుండానే తాము కోరుకొన్నపుడు కొన్ని శృంగార చేష్టల ద్వారా లైంగిక వాంఛలను కలిగించుకొంటారు. లైంగిక వాంఛలు కలిగినప్పుడు తమకు ఇష్టం లేకపోతే అదుపు చేసికొంటారు. ఈ నియంత్రణ శక్తి జంతువులకు లేదు.

జంతువుల్లో కలయిక కేవలం సంతానాన్ని అభివృద్ధి చేసికోవడానికే. ఈ క్రియ మృగాల్లో యాంత్రికంగా జరుగుతుంది. అవి తమ భాగస్వామిని ఎన్నుకోవు. పశువుల్లో లైంగికమైన ప్రేమభావం వుండదు కూడ.

కాని నరుల్లో లైంగిక క్రియ గాఢమైన ప్రేమ భావంతో నిండివుంటుంది. ముక్కూ మొగం తెలియని స్త్రీ పురుషులు ఒకరినొకరు కూడరు. వధూవరులు ఒకరినొకరు ఎన్నుకొని ఒకరినొకరు ఇష్టపడి కలయికకు సిద్ధమౌతారు. దంపతుల లైంగిక ప్రేమ ఎంత బలంగా వుంటుందంటే నరులు ఒకరికొర కొకరు ప్రాణాలు సమర్పించే సంఘటనం మాత్రమే ఆ లైంగిక ప్రేమకంటే బలీయంగా వుంటుంది.

జంతువుల్లో లైంగిక క్రియ కేవలం శారీరకమైంది. కాని నరుల్లో ఆ క్రియ మానసికమైంది. మానవుల కలయికలో రెండు దేహాలు మాత్రమే కాక రెండు మనసులు కూడ కలసిపోతాయి. పరస్పర ప్రేమ వున్నపుడు ఈ కలయిక