పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/40

ఈ పుట ఆమోదించబడ్డది

ఇది మనకు కష్టంగా వుంటుంది. మనం ఇతరులకు ఉపకారం చేయబోతే వాళ్లు మీ వుపకారం మాకక్కరలేదు, మీరు కొంచెం దూరంగా వుండండి అన్నట్లుగా మాట్లాడతారు. ఈలాంటి పరిస్థితులు ఎదురైనపుడు నిరుత్సాహం చెందక మనలను మనమే సముదాయించుకోవాలి. ఒకసారి మన ప్రేమ విఫలమైంది కనుక ఇక యెవరినీ ప్రేమించ కూడదు అనుకోకూడదు. మన తరపున మనం ఎప్పుడూ ప్రేమను చూపిస్తుండవలసిందే.

7. మామూలుగా ప్రేమకు బదులు ప్రేమ చూపాలి. కొన్నిసార్లు లోకంలో జనం ఈ బదులు ప్రేమ చూపించరు. ముననుండి బాగానే తీసికొంటారు. కాని తిరిగి మనకు ఈయరు. కృతజ్ఞత చూపించరు. అప్పడు మనం వీరికి ఉపకారం చేయకుండ వున్నట్లయితే బాగుండేది కదా అనుకొంటాం. కాని ఈ భావం పొరపాటు. ప్రేమకు ఈయడమే కాని తీసికోవడం ముఖ్యం కాదు. మనం ఇతరుల యోగ్యతను బట్టి వారిని ప్రేమించం. మన మంచితనాన్ని బట్టే ప్రేమిస్తాం.

8. మామూలుగా మనం ఎవరిని ప్రేమిస్తామో వారిని మన అదుపులో వుంచుకోగోరుతాం. మన చెరలో బంధించి వుంచుతాం. కాని ఇది నిజమైన ప్రేమకాదు. మనం ప్రేమించినవారికి పూర్తి స్వేచ్చనీయాలి. వారిని తమ యిష్టం వచ్చినట్లు పోనీయాలి. స్వేచ్ఛ ప్రతివ్యక్తికీ జన్మహక్కు మనం దాన్ని అపహరించ కూడదు. ఏవరి యిష్టాలూ, అవసరాలూ, బాధ్యతలూ వారికుంటాయి. వాటిని మనం గౌరవించాలి. మనం ఇతరులకు సహాయం చేశాం గనుక వాళ్లు మన యిష్టప్రకారమే పోనక్కరలేదు.

9. మనం అందరినీ ప్రేమించలేం. మనసస్కూల్లోని విద్యార్థులందరినీ, ఉపాధ్యాయులందరినీ పేమించలేం. అసలు వున కుటుంబంలోని సభ్యులందరినీ కూడ ప్రేమించలేం. యథార్థంగా మనం ప్రేమించేది కొద్ది మందినే. ఐనా అవసరమొచ్చినపుడు ఎవరినైనా ప్రేమించ గలిగివుండాలి.