పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

పైగా ఈ కాలంలో మన దేహాలు పెరుగుతంటాయి. శరీరంలో మార్పులు చోటుచేసికొంటాయి. మన అవయవాలు కన్పించే తీరూ, మన శరీరం రంగూ మనకు నచ్చకపోవచ్చు. పైగా లైంగికమైన కోరికలు జనిస్తాయి. భిన్నలింగ వ్యక్తులమీద ఆసక్తి పడుతుంది. ఇంటిలోను బడిలోను మనకు కొన్ని పనులు ఒప్పజెప్తారు. ఈ యంశాలన్నీ ఆందోళనం కలిగిస్తాయి. బాల్యంలో వున్న ఆనందం, స్వేచ్ఛ యావనంలో వుండవు. ఏవేవో సమస్యలు ఎదురౌతాయి. వీటిని గూర్చి ఎవరితోనైనా మాట్లాడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది.

మన సమస్యలను తల్లిదండ్రులకు తెలియజేయవచ్చు. కాని కొన్ని విషయాలు వారితో చర్చించడానికి సిగ్గుపడతాం, వెనుకాడతాం. కౌన్సిలరుతో (సలహాదారు) ఈ సమస్యలు సులువుగా చెప్పకోవచ్చు. అతని సలహా మనకు ఉపయోగపడుతుంది. అతనితో మాటలాడినపుడు మనకు ఉపశమనమూ, మనశ్శాంతీ కలుగుతాయి.

మామూలుగా జనం నేరంచేసినవాళ్లు, పిచ్చివాళూ మాత్రమే కౌన్సిలర్ దగ్గరి పోతారు అనుకొంటారు. కాని ఈ యభిప్రాయం తప్ప. జీవితం చాల క్లిష్టమైంది. ఎన్నో గొడవలు ఎదురౌతుంటాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో అర్ధం కాదు. ఆలాంటప్పడు అనుభవం కలవారిని సంప్రతించి వారి సలహాను స్వీకరించడం మంచి పద్ధతి. వాళ్లు మన సందేహాలు భయాలు తొలగించి దారి చూపిస్తారు.

కొందరు విద్యారులు సమస్యలు ఎదురైనపుడు తమ మిత్రులైన తోడివిద్యార్థులను సంప్రతిస్తారు. కాని వాళ్లకు అనుభవం వుండదు. విద్యార్థికి తోడి విద్యార్థి సలహాయిస్తే గ్రుడ్డివాడికి గ్రుడ్డివాడు దారి చూపించి నట్లుగా వుంటుంది. మన సమస్యల్లాంటివే తోడి విద్యార్థులకూ వుంటాయి. వాళ్ల గొడవలను వాళ్లే పరిష్కరించుకోలేక బాధపడుతుంటారు. ఇక వాళ్లు మనకేమి సలహా యిస్తారు?

కనుక కౌన్సిలరుని సంప్రతించడం అవసరం. మామూలుగా పెద్దస్కూళూ L