పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

కన్పిస్తుంది. ఈ కాలంలో ఆడంబరాలకు పోకుండ సాదాగా జీవించడం గొప్పకార్యమే.

2. సామరస్యం

మనదేశంలో ఏకత్వమూ భిన్నత్వమూ కూడ వున్నాయి. జాతులు, కులాలు, మతాలు మొదలైనవాటి పేరుమీదగా జనం ఎప్పడూ పోట్లాడు కొంటుంటారు. అందరమూ కలిసి వొద్దికగా జీవించడం అలవాటు చేసికోవాలి. ఇతరులను అంగీకరించాలి.

3. వెలుపలి ఆకారమే గొప్పకాదు

అట్టను బట్టి పుస్తకాన్ని అంచనా వేయకూడదు. వెలుపలికి కన్పించేది ముఖ్యంకాదు. లోపల గొప్పతనం కన్పించాలి. పైపై మెరుగులు మోసం చేస్తాయి. మెరిసేదంతా బంగారం కాదు.

4. తోడివారిని పట్టించుకోవాలి
అందరమూ మన బాగోగులు చూచుకొంటాం. నాకు మంచిపేరు రావాలని కోరుకొంటాం. కాని తన్ను తాను పట్టించుకొనేవాడికంటె తోడివారిని పట్టించుకొనేవాడే త్వరగా విజయాలు సాధిస్తాడు. 
5. ఆచరణాత్మకంగా మెలగాలి

కొందరికి విపరీతమైన తెలివి వుంటుంది. వారి పనులు కూడ చాల సంక్లిష్టంగా వుంటాయి. ఐనా జీవితంలో నెగ్గరు. మన ఆలోచనలూ పనులూ సత్ఫలితాన్ని ఈయాలి. పదిమందికి ఉపయోగపడేలా ఉండాలి.

6. నిజాయితీ

కొంతమంది మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చెప్తారు. నిజాన్ని బయటపెట్టరు. లేనిది ఉన్నట్లుగా నటిస్తారు. ఇతరులను మోసగించి లాభం పొందాలని చూస్తారు. ఈగుణం పనికి రాదు. ఉన్నది ఉన్నట్లుగా చూపించడం ఉత్తమం.