ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

8 వ్యాధి :- ఉన్మాదావస్థ యందైనను కోరికతీరనిచో ఆ స్త్రీ పురుషులు వ్యాధిగ్రస్తులు అవుతారు. ఇట్టి అవస్థకే 'వ్యాధి' అనిపేరు.

9 జడత్వష :- 'వ్యాధి' అనే అవస్థకు చిక్కిన స్త్రీ పురుషులు కొలదికాలములో జడులు (మందులు మూర్ఖులు) అవుతారు. అనగా పిలిస్తే పలుకరు. ఒకదానికొకటి సమాధానము చెప్పుతారు. ఈ అవస్థకు 'జడత్వము' అనిపేరు.

10 మరణము  :- జడావస్థ క్రమముగా మరణమునకు దారితీస్తుంది. అలా ఎవరైనా తాము ప్రేమించినవారిని పొందజాలక జడులైనపుడు కొలదికాలంలో వారు మృతిచెందుతారు.

ఈ మన్మధావస్థలు 'రతిరహస్యము' మున్నగు గ్రంథముల యందు దీనికంటె కొంత భిన్నముగా చెప్పబడ్డాయి. ఏమైనా అన్నిటిసారము ఒక్కటే. కామము ప్రబలమై వున్నప్పుడు అదినెరవేరాలే కాని నెరవేరకపోతే మృత్యువుదాకా మెట్లుకడుతుంది. అది అలా మెట్లు కడుతూ ఉన్నప్పుడు వీనికి చివరిమెట్టు మృత్యువే అనిగుర్తించి ఎల్లరు జాగ్రత్తపడుట అవసరం. కాని తాము అనుభవించే అవస్థ తీవ్రంగా ఉండనపుడు అది అంతటితో ముగుస్తుందే కాని ముందుకు పోదు. ఈవిషయమెరిగి వివేకముతో వ్యవహరించాలి.

బాల - యువతి - ప్రౌఢ - వృద్ధ

వెనుక చెప్పిన హరిణీ - బడబా - హస్తినీ జాతి స్త్రీలు వయోభేదమునుబట్టి ఒక్కొక్కరు 'బాల - యువతి - ప్రౌఢ - వృద్ధ' అని నాలుగు రకములుగా ఉంటారు.

బాల :- పదునారు సంవత్సరములకు లోపు వయస్సుకల బాల అనబడుతుంది.