ఈ పుట ఆమోదించబడ్డది

79

స్త్రీల యోనియందు వారి నెత్తుటినుండియే పుట్టినవైన సూక్ష్మక్రిములు ఉంటాయి. అవి యోనియందొక రకమైన దురదను కలిగిస్తాయి. ఆ దురద పురుషాంగముయొక్క ఘట్టనవల్ల తొలగేదై వుంటుంది. ఈ దురద తత్కాలంలో పూర్తిగా తొలగినపుడు స్త్రీ యోని నుండి రజస్సు స్రవిస్తుంది. యీ రజస్సు స్రవించినంతనే స్త్రీలు తృప్తిచెందుతారు. తత్కాలములో రతిని కోరుకొనరు. అయితే యోని యందు జన్మించే సూక్ష్మక్రిములు దురదను కల్పించే శక్తిలోకూడ తేడా వుంటుంది. కొన్ని క్రిములు సాధారణమైన దురదనుమాత్రమే కలిగిస్తాయి, కొన్నిటియొక్క శక్తి అంత తక్కువగాకాక మధ్యమంగా వుంటుంది. కొన్ని తీవ్రమైన శక్తికలవై యోనియందు ఎక్కువ దురదను జనింప జేస్తాయి.

ఇలా యీ క్రిములు మూడురకాలుగా ఉన్నాయి. వీనిలో అల్పమైన దురదను జనింపజేసే క్రిములుకలిగిన యోనికల-స్త్రీ రతివేళ తొందరగా తృప్తిచెందే లక్షణం కలదైవుంటుంది. అనగా తొందరగా రజస్సును స్రవిస్తుంది. మధ్యమమైన దురదను కలిగించే క్రిములు కలిగిన యోనికల స్త్రీలు అంత తొందరగా తృప్తిచెందరు; కాని మరీ సుదీర్ఘమైన రతినికూడ వాంఛింపరు. మధ్యమంగా తృప్తిచెందుతారు.

ఇక తీవ్రమైన దురదను జనింపజేసే క్రిమిజాతముతో నిండిన యోనికల స్త్రీలు దీర్ఘకాలిక రతికిగాని తృప్తి చెందజాలనివారై ఉంటారు.

సమరతులయందు స్త్రీయొక్క యోనికి తగిన పరిమాణములో పురుషాంగము ఏర్పడిఉంటుంది. అందుచే స్త్రీయొక్క యోని యందలి దురద సుఖంగా తొలగుతుంది. పురుషునకు కూడ ఆరతి మిక్కిలి సుఖకరంగా వుంటుంది. యీ కారణముచే సమరతి ఉత్తమమైనది; స్త్రీపురుషుల కిద్దరకు సమాన సుఖకరము అయివున్నది.