ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71

రాత్రిఅయింది. ముందుగా పడకటింటికి చేరుకొన్న ప్రియుడు భార్యరాకకై మనసులో నిరీక్షిస్తూ శయ్యమీద పెడమొగంపెట్టుకొని శయనించాడు అలుకను ప్రదర్శించడానికి వీలుగా, కొంతసేపటికి-ఆభార్యవచ్చింది. కోపకారణం ఆమెకు తెలియనిదికాదు. ఆమెకు ఏదో ప్రళయం జరుగుతుందన్న జంకులేదు. భర్తయొక్క స్వభావం ఆమెకు తెలియనిదికాదు. తాను భర్తను సులభంగా ప్రసన్నుని చేసికొనగలనన్న ధైర్యం ఆమెయందున్నది.

"శ్రీవారికి అలుకవచ్చిందా! పెడమొగంపెట్టుకొని శయనించారు"-అన్నదామె నవ్వుతూ.

భార్యకు సమాధానం చెప్పలేదు భర్త అతనిబిగింపు ఎంతటిదో ఆమెకు తెలుసు "అప్పుడే నిద్రపట్టిందికాబోలు! అంతా దొంగ నిద్ర!"-అంటూ అతనికి చక్కిలిగింత పెట్టిందామె.

వస్తూవున్న నవ్వును ఆపుకొనడానికి వ్యర్ధప్రయత్నం చేస్తూ నవ్వితే బిగింపుపోతుందని ఆతడు-ఏమిటిది? నన్ను తాకకు-అన్నాడు లేనికోపాన్ని ప్రదర్శిస్తూ.

ఆమె అతని కోపాన్ని లక్ష్యపెట్టక తిరుగఅతనికి చక్కిలిగింత పెట్టింది. అతడీమారు గట్టిగా కసరేడు.

ఈపర్యాయమామె-అంతాగొప్ప! పోనీయండి"!-అంటూ తానుకూడ కోపాన్నే ప్రదర్శిస్తూ అతనివీపుకు తనవీపునాన్చి శయనించింది. పదినిముషాలు గడిచాయి, భార్యయొక్క శరీరసన్నికర్షకు భర్తయొక్క మనస్సులోని కోరిక పట్టుతప్పి విజృంభింపసాగింది. అతడు నెమ్మదిగా ఆమెవంకకు తిరిగేడు. ఆమెపై చేయివైచాడు. ఆమె తన విజయాన్ని గుర్తించింది. అతనిచేతినామె తొలగించలేదు, అతనివంకకు తిరుగనూలేదు. అతడే ఆమెను తనవంకకు త్రిప్పుకొన్నాడు. ఆమెఒక బొమ్మవలె ఇటుతిరిగింది.

ఏబిగింపు తాను ప్రదర్శించాలని ఆభర్త భావించాడో ఆబిగింపు భార్య చక్కగా ప్రదర్శిస్తోంది. అతనిలో కోరిక విజృంభించింది. దానికి