ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61

"పార్వతీదేవి పరమశివుని గూర్చి తపం ఆచరిస్తూన్నది. ఆయన ఇంకా ప్రసన్నుడుకాలేదు. రోజురోజుకు పరమశివునికొరకై పార్వతియొక్క తహతహ పెరిగిపోతుంది. ఒకరోజున ఆమె చెలులు ఆమెను చూడడానికై వచ్చారు. వచ్చిన చెలులను చూచి పార్వతి ఏవోకబుర్లు చెపుతూ కూర్చున్నది. కబుర్లన్నీ పరమశివునిగూర్చియే. అలాచెపుతూ పార్వతి "చెలీ! పరమశివుని రూపం ఎంత మనోహరమైన దనుకొన్నావు ఆయన శిరస్సుపై జటాజూటం ఉన్నది. దానికి 'కపర్దం' అనిపేరు. ఆకపర్దం చక్కగా చుట్టబడి ఉంటుంది. దాని అందంచూస్తే తెలియీలికాని చెబితే తెలిసేదికాదు. ఉండు! నా జుట్టునే కపర్దంగా చుట్టి చూపుతాను. "అంటూ తన జుట్టును శివ జటా జూటంలాచుట్టి, ఇదిగో! ఆయన జటాజూటం ఇలా అందంగా ఉంటుంది; అయ్యో! నా తెలివి తెల్లవారినట్లేఉంది; ఆయన జటాజూటానికి దిగువగా చంద్రరేఖ వెలుగులు క్రుమ్మరిస్తూంటుంది. అదిలేకపోతే జటాజూటానికి అంత అందం ఎక్కడినుండి వస్తుంది. కపర్దాన్ని చూపడానికి నాజుట్టును చుట్టగాచుట్టాను కాని చంద్రరేఖను చూపడంఎలా? అయినా ఉండు! అంటూ తెల్లని మొగలిపూరేకను చంద్రవంగా కత్తిరించి నొసట ధరించి-ఆయనయొక్క 'కపర్దము' చంద్రరేఖ ఇలాఉంటాయి, ఆయన శరీరం తెల్లగా మెరుస్తూంటుంది. నా శరీరం నల్లగా ఉన్నది. అని తెల్లని మంచిగంధం ఒడలినిండా పూసుకొని, ఆయన మెడలో యజ్ఞోపవీతాలు (జంధెము) తెల్లగా మెఱుస్తూంటాయి అని తామర తూడు లను చీల్చగా వచ్చిన తెల్లని దారాలను యజ్ఞోపవీతాలుగా ధరించింది. ఇది ఒక కవిచేసిన వర్ణన.

స్త్రీలయొక్క ఇట్టి చేష్ట "లీల" అనబడుతుంది.

6 విలాసము : వచ్చిన భర్తను చూచినది మొదలు నవయువతియైన భార్యయొక్క నడకలో, కూర్చుండుటలో, ఉనికిలో, మాటాడుటలో, చూపులలో ఒకరకమైన మార్పువస్తుంది. ఈమార్పునే