ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30


వివిధ సంకేతార్ధాలను వెల్లడించే ప్రాచీన కామశాస్త్రాలను చక్కగా అభ్యసించాలి. నాగరక సంకేతాలను వాని అర్ధాలను వివరించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. వానియందు పరిశ్రమచేస్తే ఎట్టి సంకేతార్ధమైనాసరే వివరంగా తెలిసికొనగల జ్ఞానం అనవడుతుంది.

"మా కెందుకీబెడద" అని ఎవరూకూడ సంకేతశాస్త్రాల విషయంలో నిరాదరణ చూపకూడదు. ఎందువల్లనంటే-అన్ని గౌరవాలు లభించినా అందగత్తెయైన నాగరక యువతి తిరస్కరించినపుడు పురుషుడు పొందే దుఃఖానికి మేర ఉండదు. అట్టి యువతీ తిరస్కార రూపమైన దుఃఖం కలుగకుండ వుండాలంటే ప్రాచీన సంకేత శాస్త్రాలయందు పరిశ్రమచేయడం అవసరం. అందుచే ఇక్కడ స్త్రీలయొక్క భాషా సంకేతములను-అంగ సంకేతములను-పోటలీ సంకేతములను-వస్త్ర సంకేతములను-తాంబూల సంకేతములను సంక్షేపంగా వివరించడం జరుగుతూన్నది. ఈ వివరణ వలన పురుషునకు నీ యొక్క సంకేతార్ధాన్ని విడదీసి తెలిసికొనగలశక్తి అలవడుతుంది. ఆసక్తితో అతడు ఇందులో చెప్పబడని క్రొత్త సంకేతములనుగూడ విడదీసి అవగాహన చేసికొనగల వాడవుతాడు.

పురుషులకు ఫలము. స్త్రీకి పుష్పము సంకేతముమై ఉన్నాయి, ఎవరి కులమునైనా ప్రశ్నించి తెలిసికొన దలచినపుడు "అంకురము" (మొలక) సంకేతముగా వుపయోగింపబడుతుంది. ఇక బ్రాహ్మణుని విషయంలో దానిమ్మపండు-క్షత్రియుని విషయంలో పనసపండు సంకేతములై వున్నాయి. అరటిపండు వైశ్యునకు, మామిడిపండు శూద్రునకు సంకేతాలు.

ఇలా కేవలం సంకేతాలను చెప్పుకొంటూ వెడితే వానిని వుపయోగించే విధానం తెలియక కొంతమంది పెదవి విరుస్తారు. అందుచే వాని వుపయోగ విధానంగూడ అల్పంగా చెప్పబడుతూన్నది.

అత్తగారు-బావలు-మరదలు-ఆడబడుచులు-తోటికోడల్లు-ఇరుగు పొరుగువారు మొదలైన జనంయొక్క కట్ణడులలో