ఈ పుట అచ్చుదిద్దబడ్డది

145

భర్త తనయొక్క స్తనాదులను చేతులతో నొక్కి పీడించునపుడు భార్య "కూజితము" (పావురము వలె 'కువకువ' మనుట) దంతక్షత మాచరించినపుడు బాధతో "హుంకారము" (ఉహ్ అనుట) నఖక్షత మాచరించినపుడు 'సీత్కారము' (ఇస్ అనుట) అనే ధ్వనులను ఆచరించాలి. ఆమెయొక్క ఈధ్వనులు భర్తయొక్క ఆనందాన్ని పెంపొందిస్తాయి.

రతిక్రీడ కొంతవరకు సాగినమీదట భార్య పులకించిన శరీరముతో, చెమటతో దోగిన ముఖము కలదై అలసటను, ఆయాసమును సూచిస్తూ నిట్టూరుస్తూ నెమ్మదిగా "హా" అని మూల్గుటద్వారా పతియొక్క అనురాగాన్ని వృద్ధిచేయగలుగుతుంది. ఆమెరతివేళ ఔచిత్యమెరిగి- "అబ్బ! అంత మోటుదనమైతే ఎలా? పన్ను గట్టిగా నొక్కకు! నొక్కితే నేను ఓర్చుకోలేను! నాకంత ఓపికలేదు!" - అనే మాటలు పలుకుతూ ఉండాలి.

రతిక్రీడయందు పతి సర్వదా ఒకేరకమైన ఆవేశాన్ని ప్రదర్శించడు. ఒకప్పుడాతడు అల్పా వేశముతో ప్రవర్తిస్తే , ఒకప్పుడు అధికావేశముతోడను, ఒకప్పుడు సాధారణావేశముతోడను ప్రవర్తిస్తాడు. పతిలోని ఈ సంభోగాతురత ఏపాలులో ఉన్నదో గమనించి భార్య తదనుకూలమైన నడవడిని ప్రదర్శించాలి.

ఇక రతిక్రీడ ఉభయుల మనస్సులకు ఆనందజనకంగా సాగుతూ ఉన్నప్పుడు స్త్రీ తన వినయగుణాన్ని విడిచి, ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఒకటి రెండు అశ్లీలాలు (బూతుమాటలు) భర్తతో పలుకుటకూడ అర్హకృత్యమై ఉన్నది. ఆసమయంలో అట్టి బూతుమాటలు భార్య పలికితే భర్తలోని కామావేశం పెరుగుతుంది. ఈఒక్క సమయంలోనే స్త్రీ బూతుమాటలు పలుకుటకు శాస్త్రాలు సమ్మతించాయి దీనికి భిన్నమైన ఏపరిస్థితి యందును ఆమె అశ్లీలాలు పలుకరాదు.

రతిక్రీడ పరిసమాప్తమైనంతనే వనిత శిధిలమైన దేహము కలదై, మూయబడిన కన్నులుకలదై, తనలోని పారవశ్యాన్ని తన