ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97


సూచీచుంబనము అనబడుతుంది. కాముకుల చేష్టలకు అర్ధముండదు. ఎందుకో ప్రియురాలి పెదవులను బిగించి కూర్చుండవచ్చును. ప్రియుడామెయందున్న కోర్కెతో బిగించియున్న ఆమెపెదవులలోనుండి దారిచేసికొనుటకు తగినంత దృఢముగా నాలుకను బిగించి, అనగా దానికి దృఢతను కల్పించి-మెత్తనైన ప్రియురాలి పెదవులగుండా ఆమె నోటిలోనికి చొప్పించవచ్చును. ప్రియునియొక్క యీచేష్టవలన ఆప్రియురాలి నాడీమండలము కూడ రతికి అభిముఖమైన ఆవేశమును పొందుతూంది. ఈ చుంబనమునందు ధ్వని కూడ యేర్పడుతుంది. ఇట్టి యీచుంబనమునకు సూచీచుంబనము అనిపేరు.

2. ప్రతతాచుంబనము :- ప్రతత అనగా విస్తరించినది. నాలుక యొక్క చివరను కోరినపుడు సన్నగా చేయుట. వెడల్పుగా పల్చగా చేయుటయందు అందరకు నేరుపు సహజంగా ఉంటుంది. వెనుక చెప్పిన సూచీచుంబనమునందు నాలుక సన్నగా చేయబడి ప్రియురాలి పెదవులయందు ప్రవేశింపజేయుట జరిగితే ఈ చుంబనమునందు నాలుకను వెడల్పుగాచేసి ప్రవేశింపజేయుట జరుగుతుంది. నాలుకను వెడల్పుగాచేసి ప్రియురాలి పెదవులలోనికి ప్రవేశింపజేయుటకే ప్రతతా చుంబనమనిపేరు.

3. వాకలీ చుంబనము :- ప్రియురాలి నోటిలోనికి ప్రవేశ పెట్టబడిన తన నాలుకను ప్రియుడు ఇటు నటు కదిపినపుడు "వాకలీ" అన్న శబ్దమునకు సన్నిహితమైన ధ్వని ఏర్పడుతుంది. అట్టి చుంబనమునకు వాకలీ చుంబనమని పేరు.

4. ఓష్ఠవిమృష్టచుంబనము :- ప్రియురాలి పెదవులనుగాక కేవలమామెయొక్క నాలుకను ప్రియుడు తన పెదవులతో గ్రహించి నాలుకతో పీల్చుట వంటి క్రియ నాచరించినచో అది 'ఓష్ఠవిమృష్టము' అనబడుతుంది.

5. చుంబితము^ :- ఏమామిడి పండునో పీల్చినట్లు తాంబూలరాగాగుణమై, సువాసనాపూర్ణమైయున్న ప్రియురాలి నాలుకను వేగముగ పీల్చినచో అది 'చుంబితము' అనబడుతుంది. దీనికిని