ఈ పుటను అచ్చుదిద్దలేదు

విచారకరమైన దృశ్య చూడలేక పోయాడు, వారి నోదారుస్తూ అతడిలా అన్నాడు.

"అమ్మా, నీవెందుకిలా విచారిస్తావు, నీకుమారుని రక్షించే ప్రయత్నం నేను చేస్తాను, నీకుమారునికి బదులుగా నేనీరోజున గరుడుని భోజనమవుతాను". అని చెప్పి ఆహారంగా వెళ్ళవలసేవాడు ధరించే ఎర్రదుస్తులు తనకిమ్మని ప్రార్దించేడు, శంఖచూడుడు విస్మితుడయ్యాడు. వృద్ద తేల్లబోయింది. రాజభటుడు తన్నుతాను నమ్మలేకపోయాడు. క్షణంలో కధ అడ్దం తిరిగినట్లయింది. తమకోసం మరొక వ్యక్తి బలి అవుతాడాంటే ఆ తల్లి కొడుకులిద్దరికీ నచ్చలేదు. వారందు కంగీకరించలేదు. అతడు కోరిన ఎర్రదుస్తులు అతనికివ్వలేదు. పరోపకారం కోసం ప్రాణత్యాగం చేయటంలో తప్పులేదంటాడు జీమూతవాహనుడు. స్వార్ధంకోసం ఇంకొకరి ప్రాణాలు బలి ఇవ్వడం మహాపాపమంటారు. శంఖ చూడుడు, తని తల్లీని ఎంతచెప్పినావినక శంఖచూడుడు, తానే గదుడుని కాహారంగా పోవడానికి నిశ్చయించి, చనిపోయేముందు దైవ ప్రార్ధన చేసుకొంటానని తల్లితోకలిసి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళాడు.

ఆ రోజు దీపావళి, సర్వులకు ఆనందదాయకమైన పర్వం, పందుగకదా అని జీమూతవాహనుడికి అత్తవారు క్రొత్త బట్టలు కట్త బంపేరు. కట్నమందుకొందామనే ఆశతో నౌకర్ ఆ బట్టలు పట్టుకొని జీమూతవాహనుని వెతుక్కుంటూ వచ్చేడు. అవి ఎర్రటి పట్టుబట్టలు. ఆబట్టలు