ఈ పుట ఆమోదించబడ్డది

నాగానందం

చెల్లీ, దేవతలు అమృతం తాగేరు కదా, మరి వాళ్ళకి ఆకలి దప్పికలు లేవకదూ? అని అడిగావు. నిజమే, వాళ్ళకి ఆకలి వెయ్యదు. దాహంకూడ లేదు. అయితేనేమి, వాళ్ళకీ మనలాగే సుఖం, దుఃఖం బెంగా బెదురూ, పేమ వివాహం, ఈర్ష్యఅసూయా, స్నేహం, విరోధం వగైరాలన్నీ ఉంటాయి. వాళ్ళలోకూడ మనలో వలెనే ఎన్నో కులాలు, "తెగలు ఉన్నాయి. వాళ్ళలో వాళ్లు దెబ్బలాడుకుంటూ ఉంటారు కూడాను, చూడు. ఇప్పడో చక్కని కథ చెప్తాను విను. ఇది విద్యాధరులనే దేవతలకి రాజైన జీమూత వాహ నుని కథ. అతడెంతో మంచివాడు. పరోపకారి, స్వార్థ త్యాగి. అతనివలన నాXసలమంత్రా బ్రతికి బాxపడింది. ఈ కథ అంటే నాగులకెంతో ఆనందం.

జీమూతవాహనుడు విద్యాధరులకి రాజైన జీమూత కేతువు కొడుకు. సర్వవిధాలా తగినవాడు కదా అని తండ్రి జీమూతవాహనుణ్ణి రాజుగాచేసి "త్రాను తపస్సుకి పోదానును కొన్నాడు. కాని జీమూతవాహనుడు రాజ్యం చేయటానికి ఇష్టపడలేదు, అడవిలో తల్లి దండ్రుల సేవచేస్తూ పస్సు చేసుకోవటమే సుఖమైన జీవితమని అతడు తలంచేడు. అందుకని ఎవరెన్ని విధాల చెప్పినా వినకుండా అతడు తన