ఈ పుటను అచ్చుదిద్దలేదు

24

యంతినిచూసి నా భార్యలాగే ఉంది అంటావేమో" అంది భారతి. "అలా ఎందుకంటాను? కాని భారతీ, దమయంత్రి వంటి పతివ్రత తిరిగి పెళ్లాడడాని కెలా ఒప్పకొన్నాదో నాకు తెలియకుండా ఉంది. నలమహారాజు, కాలవైపరీత్యంవల్ల ఎక్కడ ఏ రూపులో ఉన్నాడో తెలియదు. కాని అట్టివాని భార్య, ఆపదసమయంలో ఆయనను విడిచి మరొకరిని వరించ బూనడమే ఆశ్చర్యకరమైన విషయం" అన్నాడు బాహుకుడు. "అడవిలో అతిచారణంగా వదిలేసిబోయిన నలుడు మంచి వాడా? అతని ఐపు తెలియకపోగా యిప్పడు మళ్లా పెళ్లాడ తానంటే దమయంతి చెడ్డదా? ఎక్కడనీతులివి, బాహుకా? అని ఉటంకించింది భారతి, "కాదు భారతీ, ఆమెపడే కష్టాలు చూడ లేక, అలా వదిలిపెట్టిన పిదపనైనా ఆమె తన పుట్టింటికి చేరి సుఖపడుతుందనే సహృదయంతోనే నలుడలా విడిచి వెళ్లిప్లోయుంటాడని నా నమ్మకం. ఇంతకీ భర్తఉండగా తిరిగి పెళ్లాడ దలచినమీ దమయంతి భర్త విూద నిందారోపణ చెయ్యదా? పోసి, నాకెందుకులే. ఏదో వంటలవాడిని. లోక విడ్డూరమైన విషయంకదా అని యింతవరకు ఏమో అన్నాను. క్షమించు" అని నలుడు వంటయింట్లోకి వెళ్లిపోయాడు. అత డక్కడ కళ్లు తుడుచుకుంటూండడం భారతి గమనించింది. అతడు వండిన వంటకా లడిగిపుచ్చుకొని వెళ్లింది. అన్ని సంగతులు విని, నలపాకాన్ని రుచిచూచి, దమయంతి బాహుకుడే నలుడని నిశ్చయించింది.