ఈ పుటను అచ్చుదిద్దలేదు

దమయంత్రి మొదట చిన్న నవ్వు నవ్వింది, పిదఫ ఘాంభీరముద్ర ధరించింది. వినయంగా దేవతలకి నమస్కారాలర్పించింది. పిదప “మహాశరాజా, దేవదూతగా వచ్చి నీవు నీ కార్యాన్ని నెరసులేకుండా నెరవేర్చావు. కాని నామనస్సు ఏనాడో నీపరనుయింది. దాని నిప్పుడు ఏ దేవ తలు వచ్చినా మరల్చలేరు. నీవు కాదన్ననాడు దమయంతి యీ లోకంలోనే ఉండదు. ఇక నెందుకు నేను దేవతలకి భయపడాలో నీవే చెప్ప. అయితే, నేను వారిని నిందించ లేదు. నా నిశ్చయానికి తోడ్పడవలసిందని నీమూలంగా వారిని ప్రార్ధించుచున్నాను" అని నలునితో చెప్పింది.

నలుడు మరీ మరీ చెప్పి విసిగిపోయాడు. దేవతలు తననుఅనుమానిస్తారేమో అని శంకించాడు. దమయంతికి తన విూదగల అనురాగాన్ని చూచి తనను తానెంతో అదృష్టవంతుడని మెచ్చుకొన్నాడు. దమయంతి వద్ద శెలవు పుచ్చుకొని దేవతల వద్దకి వచ్చాడు. తూచా తప్పకుండా తనకీ దమయంతికీ మధ్యజరిగిన సంభాషణ ఆంతా వారికి వినిపించాడు. దేవతల ఆశలు అడియాశలయ్యాయి. అయినా వారు తమ స్వార్ధాన్ని ఇంకా వదల దలచలేదు.

మరునాడు స్వయంవరం. రాజాధిరాజులు, రాజ కుమాయలు, దేవ గంధర్వులు కూడ వచ్చి సభనలంకరిం చారు. స్వయంగా సరస్వతి చెలికత్తెగా వచ్చి, దమయంతితో ఆయా రాజుల నామగుణకిర్తులు వర్ణించి చెప్పసాగింది.

దమయంతి కన్నుల పండువుగా అలంకరించుకొని, చేత