ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

నాయకురాలు

కన్న : సత్యాసత్యముల తగాదా అంటే యెక్కువ బాగా సరిపోతుందేమో?

బ్రహ్మ : ఒప్పుకొన్నా. నా సిద్ధాంతం నీ కర్థమయినట్టు మఱెవరికీ అర్థంగా లేదు.

కన్న : నే ధన్యుణ్ణి. తమ ఆజ్ఞలను శిరసావహించి ఆచరణలో పెడతా. పాపన్న రాయబారానికి యేమి జవాబు వ్రాస్తారు ?

బ్రహ్మ: వ్రాసే దేమున్నది ? అప్పుడు జరిగిన సంభాషణే జవాబు. దానిమీద నాయకురాలు ఏదారికి వస్తుందో చూడాలె. మనం వాండ్ల యావలు దీస్తూ మతప్రచారమూ, తద్వారా క్రొత్తసైనికులను చేర్చుకోవడమూ యెడతెగకుండా జరపాలె.

కన్న : చిత్తము.

(తెరపడుతుంది)