56
నాయకురాలు
పొదిలో - బెట్టి యూతువటర
చన్నకృష్ణు డీ - పూజలకెల్ల - సమ్మతించునటర ?
కుమ్మరి తేర్కుడు :
చన్నకృష్ణుడు - త్రిప్పుచుండు తన - సారెను యెల్లపుడు
చిత్రచిత్రముగ - ఘటములనెల్ల - చేస్తువుండు నెపుడు
అగ్గిబుగ్గితో - అతని ఆవము - ఆరిపోవ దెపుడు
పాతకుండలను - పోగు జేసి మఱి - పగులగొట్టు నతడు
కులముల - గౌరవింప డతడు
గుణముల - గొప్పసేయు నెపుడు
పాపము - పరిహరించుతాడు
పెద్దకుమ్మరని - చెన్నకేశవుడు - పేరుపొందినాడు.
పెద్దసెట్టి :
గుళ్లుగోపురాల్ గట్టి దేవునికి - కొలువు సేయగలరా
రత్నకిరీటము బెట్టి కేశవుని - రంజింపంగలరా
అమ్మవారికి పైడికంటెలను - అర్పించంగలరా
యేమిబెట్టనిది దేవుడు మీకు - యెట్లు కండ్లబడురా
వూరికె - వచ్చిదూకునటరా
కోరికె - లిచ్చిపోవునటరా
ఆశల - కంతు వుండదటగా
చిలుమువదలనిది - యెవ్వడి కైనను - ఛిద్రము బోనటరా.
బ్రహ్మనాయుడు :
పేదసాదలభేద మెరుంగని - పెద్దప్రభువతండు
చెన్న కేశవుని సాన్నిధ్యంబున - సతతముండగనుడు
చిన్ని కృష్ణుని చరణసేవనే - సేయుచుండు డెపుడు.