48
నాయకురాలు
బ్రహ్మ : మనము ఆ ఐహిక రాజ్యాన్ని ఆను జేసికొని, ఆముష్మిక రాజ్యాన్ని స్థాపించవలెనని అనుకొంటున్నాము. ఇహము ఆముష్మికానికి మెట్టుగా వుండాలె. వర్ణభేదాలు సమత్వ ధర్మానికి ప్రతిబంధకాలు. స్వల్పకాలమయినా స్వర్గమే అనుభవింతాము.
కన్నడు : ఈ యేర్పాటు కొంత యోచించి చేయరాదా?
బ్రహ్మ: దాసూ! యేర్పాటు అయిపోయినది.
బాలచంద్రుడు : మన మీ క్షణమునుంచీ వర్ణభేదాలను నిర్మూలంజేసి మన ధర్మం విస్తరింపజేయాలె.
[ సేవకుడు ప్రవేశము ]
సేవకుడు : అయ్యా, గురిజాలనుండి రాయబారి వచ్చి కాచుకొని వున్నాడు.
బ్రహ్మ : గురజాలనుంచా ? రాయబారా? అవశ్యము లోపలికి తీసుకొనిరా,
( సేవకుడు నిష్క్రమించును )
కొమ్మ : కొత్తమంత్రిణి సంధి కోరుతున్నదేమో?
బ్రహ్మ: కాదు, విగ్రహమే కోరుతుంది. వారు సంధి కోరదగిన పరిస్థితు లిప్పుడు లేవు.
[ రాయబారి ప్రవేశము ]
బ్రహ్మ: పొదిలె పాపన్నగారా ! రండి, .
పాపన్న : అయ్యా, క్షమించండి. ఇక్కడ ప్రభు వెవరో, నమస్కార మెవరికి జేయవలెనో తెలియడంలేదు. పేరులేని ప్రభువుకు నమస్కారము.
బ్రహ్మ : మీరు వచ్చినది రాయబారమునకా, తగవులకా ?