ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

నాయకురాలు

కాని యింతవరకు నే జెప్పినదంతా పురుషప్రయత్నమును గురించియే; దై వము తప్పదలంచినచో మన ప్రయత్నములన్నీ నిష్ప్రయోజనము ; చెన్నకేశవుని కృపలేనిది యేకార్యమును నెరవేరదు.

కొమ్మ : పురుషకారము మూడుపాళ్లు, దైవ మొకపాలు. దైవము తప్పక అనుకూలిస్తాడని భావించియే మనము ప్రయత్నము చేయవలసివుంటుంది. మన మిప్పుడు ప్రభుత్వ నిర్వహణానికి తగిన యేర్పాట్లు చేయవలసియున్నది.

బ్రహ్మ : మీ యందరి కోర్కెమీద నన్ను రాజుగారు మంత్రిగాను, పురోహితుడుగాను నియమించారు. కొమ్మరాజుగారూ, ముతసాని పిచ్చిరెడ్డిగారూ, గండు కన్నమనాయుడుగారూ మంత్రాలోచనసభ్యులుగా వుండి నాకు తోడ్పడ ప్రార్థితులు. పశురక్షణమునకు లంకన్నా, సేనానాయకత్వమునకు మాలకన్నడూ అర్హులని నియమించినాను.

కొమ్మ : నేను క్షత్రియుణ్ణి. క్షత్రియేతరులయిన పై వుద్యోగులకు నమస్కరించవలసిన బాధ్యత లేనియెడల యీ పదవిని స్వీకరించడానికి యేసందేహం లేదు.

ముతసాని పిచ్చిరెడ్డి : కన్నమనీడు మతవిషయమున తమకూ, యుద్ధవిద్యయందు నాకూ ప్రియశిష్యుడు. తమశిష్యుణ్ణయిన నా కేయాక్షేపణా లేకపోయినా, తమ శిష్యకోటిలో చేరని చమూపతులకూ, వాహినీపతులకూ మీ కొ త్తనియామకము కంటకముగా వుండక మానదు. ఈరోజు గురిజాల నుండి తెలియవచ్చిన సంగతులనుబట్టి నలగామరాజు నాగమాంబికను మంత్రిగాను, సర్వాధికారములు గల