ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

నాయకురాలు

షరీఖనీ, తన బలవంతంమీద మీరంతా సగాని కొప్పుకొన్నారనీ, దాని కంగీకరించకపోతే యావత్తూ పోతుందనీ త్వరపెట్టి ఒడంబడికమీద నాచేత గీటు పెట్టించుకొన్నారు.

కే: మిగిలినదానికి విచారించ పనిలేదు. తిరిగి పాటుకు వచ్చే మార్గమేదో యోచించాలె.

నర : ఆ మార్గాలన్నీ ఇప్పుడు మనకు తేలేవిగావు. నాగమ్మగారికి సర్వాధికారమిచ్చి సమయోచితంగా ఆమెనే యోచించమందాం ; ఆమె కార్యఖడ్గముల రెంటికీ దీటైన మనిషి. సర్వవిధముల బ్రహ్మనాయుడికి సమవుజ్జీ. పల్నాటిమొత్తంమీద ఆమెకు బంధుజాలమంతా బీరకాయ పీచు.

నల : బ్రహ్మనాయుడి రామానుజమతములో జేరి మాలమాదిగలంతా అటు తోజౌతారు. కన్నమనీడు మాల పటాలములకు నాయకుడట. వాండ్లంతా వీరావేశముతో రాక్షసులవలె పోట్లాడుతారు. మతావేశపూరితులైనవారి నెదిరించడం కష్టం.

కే : నాగమ్మగారు వర్ణాశ్రమాల కాపాడుతారని ప్రతీతి. చాతుర్వర్ణ్యములవారికి బ్రహ్మనాయుడి రానూనుజమత మంటే ద్వేషము. నాలుగుజాతుల బలమంతా మనకు బాస టౌతుంది..

నల : ఉభయపక్షముల బలాబలములూ చూచుకోనిది యుద్ధమున కీయకొనకూడదు. తొందరపడి వున్నదీ పోగొట్టు కుంటామేమో.