ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంకితము

లక్ష్మీనారాయణుల కల్లుడై - యల కైలాసమున
కాశీనాథుడు శిరమున నిడుకొని - గంగ నేలినాడు
కాశీనాథుని వారి వంశమున - గలిగె నొక్క ఘనుడు
నాయకురాలికి తగినభర్తని - నాగేశ్వరు డనిరి
దేశోద్ధారకనామబిరుదుడు - ధీరోదాత్తుండు
భాషాసేవయే పరమధర్మముగ - భావించెడువాడు
దేశభక్తియే దైవభక్తి యని - తెలిసిన సుజ్ఞాని
దైవదత్తమగు ధనమునకెల్లను - ధర్మకర్తననెడు
భావముతోడను పంచిపెట్టును - ప్రజలకు నెల్లెడల
లేదని చెప్పుటే వాతప్పని దా - లేదని యెరుగండు.

ఉన్నవ లక్మీనారాయణులకు - ఉద్భవమొందింది
నాయకురాలని పేరుమోసిన - నాగాంబిక కన్నె
దీటై వున్నది తల్లిదండ్రులకు - ధీరోద్ధతురాలు
అచ్చమైన తన ఆంధ్రత్వముచే - నలరుతువుంటుంది
అందుచేతనే ఆంధ్రనాయకుడు - అందెను వియ్యమును
నాయకురాలికి ప్రియతరమైన - నాయకు డై నాడు
చిరకాలముగా వారి నేస్తము - చెన్ను మీరుగాత!