ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

నాయకురాలు

కండల ముక్కలు - కాగులబట్టి
కుమ్మున బెట్టించి - కొద్దిగాకాచి
కరపచ్చిముక్కల - కమిలిపోకుండ
కొత్తనెత్తుట ముంచి - కోరలబట్టి
చెలిమెలరక్తము - చిమ్మికారంగ
పలలఖండములను - భక్షింత్రుగానో,
పుఱ్ఱెలనెల్లను - పోగుపోయించి
తేరిననీళ్లలో - తెల్లగా గడిగి
పెట పెటలాడంగ - పేలాలువేచి
పొడిపిండిగొట్టించి - బొక్కుదురుగానో,
కోట్లాదిశవముల - గుడ్లు వొలిపించి
నులివెచ్చరక్తము - నూనెయు గలిపి
గంగాళములబట్టి - కనిగుడ్లుబోసి
గట్టిపకోడీల - కరణివేయించి
భేతాళగణముకు - బెట్టింతు విందో

[విరామఘంట]

నా లీల నా కానందం.

[ నిష్క్రమణం ]

3.వ రంగము

శిబిరం

[ బ్రహ్మనాయుడు, కొమ్మరాజు ప్రవేశము ]

బ్రహ్మ: అంతా చల్లబడ్డది.

కొమ్మ : కాగి చల్లారిన కాడున్నట్లున్నది.

కేతరాజు : ( ప్రవేశించి) అయ్యా ! నమస్కారం.