ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

నాయకురాలు

నేమి సంబంధమున్నది ? నాఅన్న వారందరూ పోయినారు. మనము ఆయుధపాణులమై క్షత్రియోచితమయిన మరణమును బొందుదాము రండు. (నిష్క్రమణం )

[ మరలవచ్చి ]

బ్రహ్మ : అయ్యా ! ఏల పరువెత్తుతారు? మన కిహలోక సౌఖ్యము లేకున్నా పరలోక సౌఖ్యమయినా కావలదా ?

[ వెళ్లి, మరలవచ్చి ]

ముందుకు పొండి. పారిపోకండి.

[ వెళ్లి పోతాడు ]

[ ప్రతాపుడు- ప్రవేశము ]

ప్రతా : ఆనందం. బ్రహ్మానందం. మహదానందం. నరకండి. చంపండి. కొయ్యండి. ఎక్కడా ఇదేపని. నేను నటరాజును. నా పల్నాటినాటకము పూర్తవుతున్నది. శృంగార పురుషుడనై యమునాతీరమున తాండవమాడాను. ప్రతావుడనై కురుక్షేత్రములో, లంకాపురములో విహరించాను. శృంగారపురుషుడు ప్రపంచం సృష్టించడంలో తాండవమాడుతాడు. నేను లయించడంలో తాండవమాడుతాను. నా లీల చూడండి.

ప్రళయ గీతము

వరాళి - ఖండగతి

ఓ భైరవీదేవి - ఓ భద్రకాళి
భేతాళకాటిగా - పెదపోతరాజు
పుఱ్ఱెదండలనొప్పె - భువనైకమాత
శింబోతుచౌడమ్మ - చెండి శివసత్తి