పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/18

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రసముమీదకంటే రచనమీద, ఆర్టుమీద కన్న, నాటకములు దృశ్యములును, శ్రవ్యములును అనుమాట వీరు మఱచుచున్నారు. నాటకకులలో ఇట్టి రసవత్పర్యభాగములే కొన్ని శ్రవ్యములు.

                        సాంఘిక నాటకములు
     నటులకును, కొంతమంది ప్రేక్షకులకును రసదృష్టి సన్నగిల్లి ఆర్టుదృష్టి ఎపుడు ంబలిసెనో అపుడే సాంఘిక రాజకీయ ధార్మికాది నాటకముల అక్కఱ కలిగెను.  ఈనాటకములు గద్యబహుళములుగా నుండవలయు ననుట నిర్వివాదము.
   ఇట నొకసంగతి చెప్పవలసియున్నది.  మొన్నజరిగిన పరిషత్సభలలో పలువురు పండితులును, కవులును సాంఘికనాటకము లనగనే మూతివిఱిచిరి: వ్యావహారికభాషయెడలను, స్వగతాద్లుందరాదనునెడలను మాటికిమాటికి తమ అసమ్మతిని దెలిపిరి.
         వీరు కన్యాశుల్కము, తప్పెవరిది, టుడేలన్ చూచినవారే.
          వీరు చెప్పు ముఖ్యాపత్తులివి: పౌరాణిక నాటకములకు వచ్చినటులీనాటకములకు జనులురారు.  వీనిలో వస్తుగౌరవములేదు.  ఉన్నచో కొలది. దానినిబట్టి వీనిఆయుర్ధాయము తక్కువ.  గానమును భాషాగానమును ఉండవు. కన్యాశ్ల్క మస్తమించెను.  రాఘవాచార్యులుగారు లేనిచో 'తప్పెవరిది ' కి పోవుట తప్పు.  టుడే మెఱుగుపురువు;.
   వీరిమాటలలో కొంతసత్యము లేకపోలేదు.  కాని సాంఘికనాటకములు అపరిహార్యములు.  సంస్కృతవాజ్మయమున మహాకవులురచించిన ఉత్పాద్యములు కలవు.  వస్తుగౌరవములేని నాటకములును కలవు.  వ్యావహారికభాషలో వ్రాయబదిన కర్పూరమంజరి వగైరాలు కలవు. ఇవన్నియు రసాత్మకములని గుఱుతుంచుకొనవలెను.
    వీనివలె సాంఘికనాటకములుగూ'డ రసత్ర్మకము లయినచే హని యుండదు.  వసుగౌరవము తగ్గుగాక, ఆయు:పరిమితి పరిమిత మగుగాక, స్దంఘశ్రేయోభిలాషతో రచింపప?డిన రసాత్మకమగు ఏసాంఘికనాటకమయినను ఉపాదేయమే యగును.
   సాంఘికనాటకములకు ఆయువు తక్కువయే.  సహగమనము రామమోహనుని అమరప్రయత్నముచే మృతమైపోయెను.  ఈయాచారమునుగుఱించి