ఈ పుట ఆమోదించబడ్డది

మామూలు. నేను ఏమైనాసరే దీని అంతం కనుక్కోవాలని అనుకున్నాను.

ఈ సందర్భంలో సుబ్బారావు పంతులుగారు స్వయంగా కదలడమే కాకుండా డిసెంబరులో హేమ్నెట్‌ని పోర్‌బ్సుదగ్గిరికి పంపించారు. అప్పుడు సబ్‌కలెక్టరు విస్, అతను నా స్వతంత్రపు పోకడలకి కొంత కటకట పడినా అసలు పిటీషనులలో బలం లేదని తెలుసుకున్నాడు. గవర్నమెంటుకి పంపబడిన పిటీషన్ విచారణకి వచ్చిన ప్పుడు దస్కద్దారులు తప్పితే మరో మనిషి ఎవడూ కనబడలేదు.

ములుకుట్ల అచ్యుతరామయ్యగారు ఉల్లితోటలో వుండే అకుసూరి రంగారావు నాయుడుగారి దగ్గిరికి వెళ్ళి ఆయన ప్రమత్తులై వుండగా వట్టి తెల్లకాగితంమీద దస్కత్ చేయించారు. ఆ సంగతి తెలిసి వెంటనే కలెక్టరుకి టెలిగ్రాము ఇప్పించాను. అధికారం కోసమూ, దానికి సంబంధించిన కక్ష సాధించడానికీ, ఎంత విద్యావంతు లైనా ఏరీతిగా పతనమవుతారో తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. చివరికి కలెక్టరు కూడా పిటీషన్లలో సంగతులు ఋజువు కాలేదనీ, అయినప్పటికీ తన వాకబువల్ల నేను ప్రభుత్వానికి చాలా ప్రతికూలుడననీ, స్వతంత్రుడననీ తెలిసిందనీ, అందుచేత గెజెట్ చెయ్యకూడదనీ వ్రాసి పంపించాడు.

ఈలోగా నేను మద్రాసులో పోర్‌బ్సుని చూశాను. ఆయన దర్శనం అవడమే బ్రహ్మాండం అయింది. పది పదిహేను రోజులు ఇంటికి వెడితే ఇంట్లో ఉండగానే ఇంటిదగ్గిర లేరని జవాబు వచ్చేది. చివరికి నాకు ప్రాణం విసిగింది. కార్డు వెనకాల "15 రోజులనించి రోజూ దర్శనం కోసం ప్రయత్నిస్తున్నాననీ, దర్శనం ఇచ్చేదీ, లేనిదీ నిర్దిష్టంగా తెలియపరచమనీ" వ్రాసి పంపించాను. దానిమీద అతను "ఉపేక్ష మన్నించమనీ, ఆ సాయంత్రమే కూనూరు పోవడానికి సామాను సర్దుకుంటున్నాననీ, తిరిగి మద్రాసు వచ్చాక తప్పక చూస్తాననీ," బదులు వ్రాశాడు.

ఆయన కూనూరునించి తిరిగి వచ్చాక నే నాయన్ని చూశాను. అది డిసెంబరునెలలో అని నా జ్ఞాపకం. సుబ్బారావు పంతులుగారి ప్రోత్సాహం పైని హేమ్నెట్ కూడా, డిసెంబరులో ప్రత్యేకంగా