పుట:Naajeevitayatrat021599mbp.pdf/913

ఈ పుట ఆమోదించబడ్డది

పట్టణం కోట గుమ్మందగ్గర ఆయన కాంస్య విగ్రహాన్ని స్థాపించారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారు, ప్రభుత్వపక్షాన హైదరాబాదులో శాసన సభా భవనానికి ఎదురుగా ప్రకాశంగారి మరొక కాంస్య విగ్రహాన్ని స్థాపించారు.

ఆయనకు ప్రకాశంగారి యెడల గురుభావముంది.

25

ప్రకాశంగారి శతజయంతి

1971 సెప్టెంబరు 10 న, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారు ప్రకాశంగారి శతజయంతి ఉత్సవం జరపడానికి నిశ్చయించి, అప్పటిమటుకు లక్షరూపాయలు మంజూరుచేసి, ప్రారంభ సమావేశంగా, హైదరాబాదులోగల జూబిలీ మందిరంలో మంత్రులు, శాసన సభ్యులు, పౌరముఖ్యులు, కార్మిక పక్ష నాయకులు, రాజకీయ నాయకులతోకూడిన ఒక మహా సభను ఏర్పాటు చేశారు.

"అతిదూరదృష్టిగల మహామానవుడు"

ఆ సభకు ప్రారంభోత్సవం చేసిన రాష్ట్రపతి వి. వి. గారు తమ ప్రారంభోపన్యాసంలో ఇలా అన్నారు:

"ప్రకాశంగారు ప్రజా సంరక్షకులు. ఉజ్వలమైన శక్తి గల వ్యక్తి. బ్రతికి ఉన్నంత కాలం మనుష్యులమధ్య అతి ప్రమాణమైన మహామానవుడుగా సంచరించేవారు. ప్రజా సమూహమును కూడగట్టుకొని, కదిలించి, నడిపించే శక్తి ఆయనలో హెచ్చుగా ఉండేది. వేలాది ప్రజలను అన్ని వేళలా ఆకర్షించగలిగిన గుణవైశిష్ట్యము ఆయనలో ఉండేది. నిరుపమానమైన త్యాగశీలత ఆయన ముఖ్యగుణం.......

"1916 లో నేను ఇంగ్లండునుంచి బారిష్టరుగా తిరిగి వచ్చినప్పుడు కార్యకారి, ముఖ్య న్యాయమూర్తి, శేషగిరి అయ్యర్‌గారల ఎదుట నన్ను న్యాయవాదిగా, బారిష్టరు పట్టీలో