పుట:Naajeevitayatrat021599mbp.pdf/912

ఈ పుట ఆమోదించబడ్డది

యంలో, చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళిపోయారు. ప్రకాశంగారు ముందుకు వచ్చారు.

మిలటరీ పోలీసులు ప్రజావాహినిని అడ్డబోయినపుడు, చొక్కా విప్పి, తనపై తుపాకి గుండును వారు పేల్చుకోవచ్చని గుండె చూపించిన సాహసి ప్రకాశంగారు. ఆయన తన సర్వస్వం (దేశస్వాతంత్ర్య సమరంలో) త్యాగంచేసిన మహావ్యక్తి. ఆయన బారిష్టరు. ప్రముఖ న్యాయవాదిగా వృత్తిచేసి గొప్ప ఆస్తి సంపాదించారు. నిన్న ఆయన మరణించిన నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగలలేదు.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికై ఆయన నిరంతర యత్నం చేశారు. ప్రజాసేవకు, త్యాగనిరతికి ఆయన పెట్టినది పేరు.

ఆయన ముఖ్య మంత్రిత్వము ఆయిన తర్వాతకూడా, ఆంధ్రప్రభుత్వం ఆయన సలహా సంపత్తిని ఆశిస్తూనే ఉండేది.

సక లాంధ్ర దేశం ఈ రోజున దు:ఖంలో నిమగ్బమయింది.

ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగారలు మంచి ఔచిత్యం ప్రదర్శించారు.

సభ్యులు యావన్మంది ఒక్క నిమిషం నిశ్శబ్దంగా లేచి నిలవ వలసిందని కోరుతున్నాను."

లోక్ సభ సభ్యులందరు లేచి తమ స్థానాలలో నిశ్శబ్దంగా నిలుచున్నారు.

ఆంధ్రదేశం నిశ్శబ్దమైంది.

సానుభూతి సభలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు

సానుభూతి సభలు, తీర్మానాలు అసంఖ్యాకంగా జరగడంలో ఆశ్చర్యంలేదు. ఆయన పేరిట యువజన సభలు స్థాపన కావడంలోనూ వింతలేదు.

కొంతకాలం తర్వాత, రాజమహేంద్రవరం పౌరులు, ఆ