పుట:Naajeevitayatrat021599mbp.pdf/902

ఈ పుట ఆమోదించబడ్డది

ఆ విషయానికి రాలేదు. "నువ్వు ఇంతసేపూ మొదటి పేజీలోనే ఉన్నావు. నాకు కావలసింది రెండవ పేజీలో చివర, ఒక క్రొత్త పేరాగ్రాపు ఆరంభంలో ఉన్నది. అది చదువు," అన్నారు.

ఆయన కాగితాలు స్వయంగా చదువుకోలేరని ఆయనపై జవహర్‌లాల్ నెహ్రూగారికి గవర్నరు 'ఉత్తరాలు వ్రాసిన రోజులవి.

ఆ ఉదంతం జరిగి ఏడాది అయిపోయింది.

పూర్వం రోజుకు రెండుగంటలు నడిచే ప్రకాశంగారు, ఇప్పుడు ప్రొద్దునవేళ, సాయంకాలంవేళ పది నిమిషాల నడకతో సంతృప్తి చెందవలసి వచ్చింది.

అయినా, హైదరాబాదు, విజయవాడ, చెన్నపట్నాల మధ్య పర్యటించడం, పాత మిత్రులను కలుసుకోవడానికి యత్నించడం ఆయన మానలేదు.

అన్ని కార్యాలలోను మనిషి సాయం కావలసిన రోజులు వచ్చాయి. కాని, అటువంటి పరిస్థితిలోనే, నేను ఢిల్లీలో ఉండగా, ఆయన - కొడుకూ అతని పిల్లలూ, ఉప్పులూరి వెంకటకృష్ణయ్యగారూ, మొదలైనవారితో కలిసి వచ్చారు.

నేను ఎంత కోరినా మా యింటి దగ్గర బస చేయక, కొడుకు ప్రోద్బలంవల్ల, నాకు అనవసరంగా కష్టం కల్పించడం ఇష్టం లేదనే నెపంమీద, 'ఇంపీరియల్‌' హోటలులో దిగారు. 3, 4 రోజులుండి, గోవిందవల్లభ పంత్‌గారితో మాట్లాడి విజయవాడ తిరిగి వెళ్ళారు.

ఆ రోజుల్లోనే ఉప్పుటూరి వెంకటకృష్ణయ్యగారు తాను కోర్టు వేలంలో కొనుక్కునా స్వరాజ్య ఆఫీసు భవనాలు అమ్మి, అందులో తాను ఖర్చు పెట్టిందిగాక అదనంగా వచ్చిన డబ్బు, ప్రకాశంగారి కొడుకు హనుమంతరావుకు అంతో, ఇంతో ఇస్తానని వ్రాసిన కాగితం నాకు చూపించారు. నేను అది బాగానే ఉన్నదని ఆయనను ప్రశంసించాను. కాని, తరువాత మాత్రం అలా జరిగినట్టు కనిపించలేదు.

ప్రకాశంగారు - సహజంగానే, సభావేదికమీద మాట్లాడవలసి వచ్చినప్పుడు, కొంతసేపటివరకు మాట్లాడ నారంభించక పోవడం