పుట:Naajeevitayatrat021599mbp.pdf/890

ఈ పుట ఆమోదించబడ్డది

కలకోసం పార్టీ మారడంవల్ల ప్రజలకు అంతకుముందు మాలో ఉన్న విశ్వాసం తగ్గికూడా పోవచ్చు. అందుచేత, కాంగ్రెసులో కలియడం అన్న చర్చ వదిలిపెట్టి, ఎన్నికలలో మనం చేయవలసిన కార్యక్రమం గూర్చి నిర్ణయానికి వస్తే మంచిది. విడి పార్టీలుగా మనం పరస్పరం నియోజక వర్గాలు పంపకం చేసుకొంటే, ప్రజలలో నైతికంగా హెచ్చు విశ్వాసం కలగడానికి అవకాశం లేదు. అందుచేత, నేను బలవంతరాయ్ మెహతాగారితో సూచించిన సూత్రం మీకు వివరిస్తాను. ఏయే పార్టీలు ఈ 13 నెలలు ఆంధ్రలో కలిసి రాజ్యం చేశాయో, అవి - ఏకమైన ఎన్నిక ప్రణాళికతో, ఏకమైన సెలెక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని, ప్రజల ముందుకు ఏకగ్రీవంగా వెళ్ళినట్టయితే మనకు విజయం తప్పదు," అన్నాను.

నా ఈ మాటలు విన్నతర్వాత, ఆయన సూక్ష్మగ్రాహి గనుక, వెంటనే - అంగీకరించా నన్నమాట ప్రత్యేకంగా అనక, "మీ కలయికలో ప్రొఫెసర్ రంగాగారి పార్టీని కలిపితే బాగుంటుందా?" అని యథాలాపంగా అడిగారు.

నేను వెంటనే, "ఆయన ఈ పార్టీలతో కలియడం దేశానికే, మన ఎన్నికలకూ కూడా చాలా మంచిది. ఆయనను తప్పకుండా కలియవలసిందని ఎలాగూ కోరదలుచుకొన్నాను," అన్నాను.

దానిపై నెహ్రూగారు "నేను త్వరలో ఇండోనేషియా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళేముందు, మీరుఢిల్లీవచ్చి కలుసుకొంటే - లాల్ బహదూర్‌శాస్త్రినీ, మౌలానా సాహేబునీ, మిమ్మల్ని కలిపివేస్తాను. నీవు చెప్పినట్టు మిగిలిన కార్యక్రమం వారితో నడిపించవచ్చును. నేను విదేశ పర్యటననుంచి తిరిగి వచ్చేసరికి, కొంత కార్యక్రమం సాగనివ్వండి," అన్నారు.

తర్వాత మామూలుగా కరచలనాలు మొదలైన వీడ్కోలు లాంఛనాల అనంతరం, సగం రాత్రివేళ, ఎవరి త్రోవన వారు వెళ్ళిపోయాము.

తెల్లవారే సరికి - నెహ్రూగారికి, నాకు మధ్య జరిగిన ఏర్పాట్లు