పుట:Naajeevitayatrat021599mbp.pdf/886

ఈ పుట ఆమోదించబడ్డది

అలాగునే, మర్నాడు కొందరు శాసన సభ్యులు, ఊళ్లో గల కొందరు పెద్దలు ప్రకాశం గారిని అడగడం తటస్థించింది.

అటువంటి కోరిక వారి సద్భావ సూచకమే గాని, రాజనీతి లక్షణంతో కూడింది గాదని వేరే చెప్పనక్కరలేదు. అందుచేత అటువంటి యత్నాలన్నీ వారు మానుకున్నారు.

తర్వాత జరిగిన చరిత్రను బట్టి చూస్తే ప్రకాశం గారి ప్రభుత్వ పతనం ప్రజలకు ఆమోదకరంగా లేదని గ్రహించవచ్చు.

23

మరల ఎన్నికలు


విశ్వాసరాహిత్య తీర్మానం 6-11-54 న పాసయింది సంవిధానం 356వ అనుచ్ఛేదం క్రింద రాష్ట్రపతి గారు ఉద్ఘోషణ(ప్రొక్లమేషన్) చేసి, శాసన సభను రద్దుచేస్తున్నామనీ, తిరిగి సాధారణ ఎన్నికలయ్యే వరకు ప్రభుత్వం తమ చేతిమీదుగా నడిపింపబడుతుందని ప్రకటించారు.

ప్రభుత్వ పతనానంతరం కొందరు కాంగ్రెస్ మిత్రులు నాదగ్గరికి వచ్చి"భవిష్యత్తులో- జరిగిన భంగపాటుకు ఏలాగు ప్రతీకారం జరగాలి?" అని అడిగారు.

వారికి నేనిలా చెప్పాను:"ప్రభుత్వ పక్షాన ప్రస్తుతం కాంగ్రెసు, ప్రజా పార్టీ,స్వతంత్రులు కలిసి ఉన్నాం కదా!అంతేకాక ప్రభుత్వం పడిపోయినందుకు విచారించే మరికొందరు సభ్యులు ప్రతిపక్షంలోనే ఉన్నారు. మనం కలిసినట్లయితే, ఎన్నికలలో తప్పకుండా జయప్రదంగా బయటపడవచ్చు. ఈ కలియడంలో నియోజక వర్గాలలో పార్టీలుగా ఒకరి నొకరు సంప్రదించుకునే ఏర్పాట్లు చేసే పద్ధతిలో మనమీద ప్రజలకు అభిమానమున్నా, 5ఏళ్లుకలిసి రాజ్యం చేస్తామన్నా విశ్వాసం గట్టిగా కుదరదు.మన పక్షాన ఉన్న వారందరము కలిసి ఒకే ఎన్నిక ప్రణాళిక క్రింద సంతకం పెట్టాలి.అభ్యర్ధులను నిర్ణయించేందుకు ఒకటే సెలక్షన్ కమిటీ ఏర్పాటు కావాలి. ఈ సూత్రం