ఈ పుట ఆమోదించబడ్డది

ఓడించి, రాయపూడి సుబ్బారాయుడూ నేనూ మా మనుష్యుల్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టగలిగాము.

1901వ సంవత్సరంలో దుర్గయ్యగారి ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. అప్పుడు స్నేహితు లంతా నన్ను ప్రోత్సాహం చేశారు. సుబ్బారావు పంతులుగారు దుర్గయ్యగారి పార్టీని ఓడించినంతవరకూ ఆంతర్యంలో సంతోషించేవారే కాని, నేను ఛైర్మన్ అవుతానంటే ఎంతమాత్రమూ ఇష్టపడేవారు కారు. ఆయన స్వత: నేను స్వతంత్రుణ్ణి అనీ, తమ చెప్పు చేతలలో ఉండననీ నిశ్చయించుకుని వ్యతిరేకంగా పనిచేశారు.

అప్పటికి నా ప్రాక్టీసు బాగానే వుండేది. చిన్నప్పుడు నా సహాధ్యాయీ, హనుమంతరావు నాయుడుగారి మేనల్లుడూ అయిన పిళ్ళారిసెట్టి నారాయణరావు బి.ఎ., బి.ఎల్. పాసయి హైకోర్టు వకీలు అయ్యాడు. మేము వుభయులమూ రిజిష్టర్డు పార్ట్నర్ షిప్ ఏర్పాటుచేసుకుని జాయింటు ప్రాక్టీసు ప్రారంభించాము. సెంట్రల్ మార్కెట్టుకి ఎదురుగా వున్న కోకా వెంకటేశ్వరరావుగారి ఇంట్లో మా ప్రాక్టీసు. జిల్లా కోర్టు పని అతనూ, మిగతా పని నేనూ చూసుకుంటూ వుండేవాళ్ళము. మా తమ్ముడు శ్రీరాములు బి.ఏ. పాసయి ఫస్టుగ్రేడుకి చదువుకుంటున్నాడు. అతను ఫస్టుగ్రేడు పాసయ్యాకా కొద్దికాలం నా దగ్గరే ప్రాక్టీసు చేశాడు.

ఆ సమయంలోనే కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నిక జరిగింది. మునిసిపల్ కౌన్సిలర్లు అంతా వోటర్లు. ఆరోజుల్లో అప్పుడే ఇంగ్లండు వెళ్ళి వచ్చిన కోలాచలం వెంకట్రావుగారికీ, సుబ్బారావు పంతులుగారు ఏర్పాటుచేసిన కృత్తివెంటి పేర్రాజుగారికీ పోటీ జరిగింది. కోలాచలం వెంకట్రావు అంతవరకూ బళ్ళారిలో ఫస్టుగ్రేడు ప్లీడరుగా వుండేవారు.

అల్లాంటప్పుడు "ఛైర్మన్ ఎవ్వరా?" అనే తర్జనభర్జన వచ్చింది. కొందరు దుర్గయ్యగారినే మళ్ళీ వుండమని అడిగారు. కాని, ఆయన తనకి మెజారిటీ లేనపపుడు అలాగ వుండడం సబబు కాదని చెప్పి