పుట:Naajeevitayatrat021599mbp.pdf/844

ఈ పుట ఆమోదించబడ్డది

824

నా జీవిత యాత్ర-4

మర్నాడు ఉదయమే ఉరిశిక్షకు పాత్రుడయిన ఒక ఖైదీ విశాఖపట్నం జైలులో ఉండెను. అక్కడి జైలరుకు ప్రభుత్వ తీర్మానం అందకపోవడంవల్ల, తన డ్యూటీ ప్రకారం అత డా శిక్షను అమలు పరిచాడు.

ఘోరము జరిగింది. కాని ఎవరమూ ఏమీ చేయలేకపోయాము.

ఈ సర్వకారగారవాసుల విముక్తి విషయం బయటపడేసరికి చాలామంది సంతోషించారు. కొందరు విభ్రాంతు లయారు.

భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, నెహ్రూగారుకూడా ఇంత సాహసకార్యం చేయలేదని - స్వాతంత్ర్య వాదు లనేకులు ప్రకాశంగారిని ప్రశంసించారు.

వ్యక్తిగతంగా, ప్రకాశంగారికి వ్యతిరేకులు కొందరున్న విషయము అందరికీ తెలిసిందే.

ఇలా ఉండగా, నెల్లూరిలో బెజవాడ గోపాలరెడ్డిగారి మామగారి యింట్లో దొంగలుపడి, బంగారపు వస్తువులను దొంగలించారన్న వార్త పత్రికలలో పడింది.

వెంటనే ఈ దొంగలు, ప్రకాశంగారివల్ల విడువబడ్డవారేనని నిశ్చయించి, ప్రకాశంగారు చేసినంత తెలివితక్కువ పని ఎవరూ చేయరని ఆయన వ్యతిరేకులు వాదించారు.

గవర్నరు నన్ను పిలిచి, 'చూశావా ఈ వార్త' అని ముదర కించారు.

వెంటనే, మేము ప్రభుత్వపక్షాన దర్యాప్తు జరిపించగా, ఆ దొంగతనము చేసినవారు "ఫస్ట్ అఫెండర్స్," (అనగా అప్పుడే మొదటి నేరము చేసినవారు)గా తెలియవచ్చింది.

ఆ తర్వాత ఈ పై విధంగా విమిక్తి పొందిన వా రెవరూ తిరిగి నేరాలు చేశారన్న రిపోర్టులు ప్రభుత్వానికి రాలేదు. పత్రికలలోనూ అటువంటి వార్తలు పడలేదు.

అయితే, ఈ విషయానికి సంబంధించిన ఒక ముచ్చట చెప్తాను.

భాషారాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భంలో, ప్రకాశంగారు