పుట:Naajeevitayatrat021599mbp.pdf/814

ఈ పుట ఆమోదించబడ్డది

వార్త తెచ్చిన ఆయన చెప్పాడు. అందుకు శ్రీరాములుగారు "ఉపవాస దీక్ష విరమించవలసిన అవసరం కనపడదు," అని చాలా మెల్లిగా చెప్పారు.

ఆ మాటలో ఆయన దృఢనిశ్చయం వెల్లడి అయ్యేట్టు ఆయన చేతులతోను, కళ్ళతోను సూచించారు.

ఈ విధంగా ఉపవాస దీక్ష సాగించి, 58 వ రోజు రాత్రి, 59 వ రోజు వచ్చేముందు ఆ మహాత్యాగి అసువులు బాశారు.

ఒక్కమారుగా ఆంధ్రదేశం పెనుబొబ్బ పెట్టింది. సాయంకాలంవరకు ఆయన భౌతిక దేహాన్ని, ప్రజలు చూడడానికి వీలుగా సాంబమూర్తిగారి యింటి బయట ఎత్తయిన వేదిక ఏర్పరచి ఉంచారు.

మైలాపూరునుంచి రెండెడ్ల బండిపైని అ భౌతిక దేహాన్ని ఉంచి, మౌంటురోడ్డునుంచి జార్జిటవును వీథులగుండా, వెనుక లక్షల కొద్ది ప్రజలు నడుస్తుండగా, ఏడెనిమిది గంటల వేళకు దహన భూమికి తీసుకు వెళ్ళారు. ఆ రెండెడ్ల బండి నొగపై ప్రకాశంగారు, సాంబమూర్తిగారు చివరివరకు కూచున్నారు.

ఆధునిక కాలంలో, ఇచ్ఛా మరణం పొందిన మహర్షి వలె, పొట్టి శ్రీరాములుగారు - ఐదు, ఐదున్నర అడుగుల పొడవుగల అల్పమైన భౌతిక దేహాన్ని వదిలి, సర్వ భారత దేశవ్యాప్తమైన అమరజీవిగా వర్దిల్లారు. నేడు భారతదేశంలో ఏర్పాటయిన భాషా రాష్ట్రాలు, నిజముగా ఆనాడు ఆయన చేసిన మహాత్యాగ ఫలితాలే.

ఆయన అమరులైన అ సమయంలో - అనేక శాసన సభ్యులు, ప్రభుత్వం వైఖరికి నిరసనగా, తమ సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చారు. శ్రీరాములుగారు డిసెంబరు 16 న అస్తమించారు. ఆ తర్వాత, తొమ్మిదిన్నర నెలల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉదయించింది. అ తరువాత మూడేండ్లు ముప్పై దినాలకు విశాలాంధ్రగా విస్తరిల్లింది.

ప్రజా సోషలిస్టు పార్టీ

1952 లో ఎన్నికలయిన తర్వాత అప్పటికి నాల్గు సంవత్సరాల ముందు కాంగ్రెసులోంచి విడిపోయిన ఆచార్య నరేంద్రదేవ్, జయ