పుట:Naajeevitayatrat021599mbp.pdf/800

ఈ పుట ఆమోదించబడ్డది

ఏమి జరిగిందో! ఏ దేముడు బాలట్ పెట్టెలో దూరి వోట్ల భక్షణ కావించాడో! ఇప్పటికీ తెలియదు.

ఎలక్షన్ పిటీషను వేయమని మిత్రులు బలవంతం చేసినా, ప్రకాశంగారు తమ "రాజకీయ జీవితాన్ని ఎలక్షన్ పిటీషనులతో నడుపుకోలే" మన్నారు.

1951 లో, నీలం సంజీవరెడ్డిగారు ఎన్నికకయినట్టు తెలియగానే, మంత్రివర్గీయులు కాంగ్రెసుభవనం ఆవరణ గోడలెక్కి లోపలికి దూకి, భవనం గదులలోఉన్న రంగాగారి వర్గీయులకు చెందిన సామానులను వాటినీ ఇవతల, అవతల విసిరివేయసాగారు.

రంగాగారి వర్గంలో ప్రతికూలచర్య తీసుకోడానికి సాహసము, బలమూ కలిగిన యువకులున్నా - తగాదాలు వచ్చినప్పటికీ ఒకే పార్టీ వాళ్ళము గనుక మూర్ఖులయెడల మూర్ఖత వహించడం మంచిది కాదని శాంతించారు.

ఏమైనా, ఆ రోజున మంత్రివర్గీయులు చూపించిన ముష్కరత్వానికి సమానమైనది మరెన్నడూ చూడలేదు.

బహుశ: డిల్లీలో 1970 లో క్రొత్త ప్రాత కాంగ్రెసులు విడిపోయిన తర్వాత, కాంగ్రెసు ప్రాంగణంలో జరిగిన ప్రహరణకాండ కొంచెం ఆ స్థాయికి వచ్చిందేమో!

17

క్రొత్త పార్టీ స్థాపన

అప్పట్లో, చిరస్మరణీయులైన కాళేశ్వరరావుగారు[1] ప్రకాశంగారి పక్షంలో ఉండేవారు. మే మందరమూ (అంటే, ప్రకాశంగారు, రంగాగారి వర్గీయులమంతా) కలిసి వారి యింట్లో సమావేశమయ్యాము. చివరి క్షణంలో, మాలో నలుగురు అకారణంగా మంత్రి

  1. కాళేశ్వరరావుగారు విజయవాడలో, సుప్రసిద్ధ న్యాయవాదిగా ఉండి, గాంధీగారి ఉద్యమ ఆరంభంలోనే, సత్యాగ్రహ సమరంలోకి దుమికిన అగ్రనాయక శ్రేణికి చెందినవారు. బెజవాడ పట్నానికి మునిసిపల్ ఛేర్మన్ గా ఉండేవారు, మహా మేధావి, త్యాగశీలులు. ఉద్యమ సందర్భంగా అనేక పర్యాయాలు కారాగార శిక్షలు అనుభవించినవారు. చివరి రోజులలో ఆంధ్ర ప్రదేశ్ లో స్పీకరుగా ఉండేవారు. సంఘ సంస్కర్త, చరిత్రకారులు.