పుట:Naajeevitayatrat021599mbp.pdf/794

ఈ పుట ఆమోదించబడ్డది

గారి పైన ఆరోపణలతో ఎస్. సుబ్బారావు అనే ఆయన వ్రాసిన ఉత్తరం అచ్చయింది. (వెంకటరామయ్యగారి గురించి యిదివరలో వ్రాసి ఉన్నాను.) వెంకటరామయ్యగారు, పత్రికను నిర్వహిస్తున్న ఎస్.వి. కొండపిగారిమీద పరువునష్టం దావా వేశారు.[1] ఆ దావా కోర్టువారు కొట్టేశారు.

అంతకుముందు, డాక్టర్ పట్టాభిగారు చాలా గొప్ప ప్రచార ఆర్భాటములు జరిపి, చెన్నపట్నంలో మౌంటురోడ్డులో ఉన్న కిర్లంపూడి జమీందారుగారి భవనం కొని, అందులో బొబ్బిలిరాజా మొదలయినవారి సహాయంతో "శుభోదయ" అనే దినపత్రిక ప్రచురింప సాగారు. ఆయన అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యులు గనుక, గాంధీగారికీ, ఆయనకూ పరిచయ మెక్కువన్న పేరువల్ల, కాంగ్రెసు శాసన సభ్యులుగా ఉండదలచిన చాలామంది ఆ పత్రికలో పెద్ద పెద్ద మొత్తాలిచ్చి వాటాలు కొన్నారు. కానీ, ఆ పత్రిక దురదృష్ట వశాత్తు ప్రారంభంలోనే ఆగిపోవలసిన పరిస్థితికి (ఏ విధంగానో నాకు జ్ఞాపకంలేదు) వచ్చింది. కె. అప్పారావుగారు అనే ఆయన ఆ పత్రిక భవనాలకు, యంత్రాలకు యజమాని కావడం జరిగింది. ఆయనకు, ప్రకాశంగారిమీద భక్తి కుదరడంచేత, ఆ భవనంలోనుంచే ఆ అచ్చు యంత్రాలపై ముద్రింపబడి 'ప్రజాపత్రిక' తెలుగు దినపత్రికగా రూపొందింది. అప్పట్లో, క్రొవ్విడి లింగరాజు మొదలైనవారు సంపాదకులుగా ఉండేవారు. పత్రిక ప్రకాశంగారిది కావడంతో, పత్రికలో చదవదగిన వార్తలు, వ్యాసములు ఉండగలవన్న విశ్వాసంచేత మొదటి రోజునే తొమ్మిది, పదివేల కాపీలు చెల్లాయి.

అప్పటికి ప్రత్యేకాంధ్ర దేశమనే నినాదం నాలుగుమూలలా ఎగబ్రాకి ఉన్నది. అధికార దుర్వినియోగం చేసిన చెన్నరాష్ట్ర మంత్రి

  1. ఈ కొండపిగారు ఆ రోజులలో ప్రకాశంగారికి ప్రైవేటు సెక్రటరీగా ఉండి, ఆ పత్రికను నిర్వహించేవారు. ప్రస్తుత మాయన హైదరాబాదులో బాగా ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాది.