పుట:Naajeevitayatrat021599mbp.pdf/787

ఈ పుట ఆమోదించబడ్డది

బ్యాంకు ఉత్తరం సంగతి తెలిసి ఉండికూడా, నెహ్రూగారు, "పరిశీలనకేముంది? పరిశీలనకేముంది? అని పదిసార్లు తప్పించి మాట్లాడారు.

చివరకు, ఆ ఆరోపణ సరియైనది కాదని ఒక ఉత్తరం మూలంగానైనా అధిష్ఠానవర్గంవా రెవరూ తెలియపరచలేదు.

చివరకు నివేదిక వ్రాసేటప్పుడు మాత్రం, ప్రకాశంగారిపై వ్రాసిన పిర్యాదులో పేర్కొన్న వ్యక్తికి, అందులో చెప్పిన బ్యాంకులో అకౌంటు లేదని వ్రాశారు.

ఈ ఉత్తరం ఎక్కడ, ఎలా పుట్టింది? ఇటువంటి ఘోరమైన అసత్యారోపణలు చేసినవారిపై ఏమి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి? - ఈ వ్యవహారాలు వారెవ్వరూ పట్టించుకోలేదు.

అటువంటి కాంగ్రెసువాదులూ, అటువంటి కాంగ్రెసు అధిష్ఠాన వర్గమూ ఉండడంచేతనే - సత్యాహింసాచక్రద్వయం పైని, మహాత్మా గాంధీగారు స్వాతంత్ర్య రథాన్ని నడిపించి సంపాదించిన స్వతంత్ర భారతదేశానికి, ఇప్పుడు మనమంతా చూస్తున్న కడగండ్లు కలగడంలో ఆశ్చర్యం లేదు.

16

సంవిధాన సభ:ఆంధ్రరాష్ట్రము

లోగడ ప్రకాశంగారి ఒత్తిడిపైన, మరికొందరు మిత్రుల ఒత్తిడిపైన - సంవిధానం ముసాయిదాలో ఆంధ్రరాష్ట్రం పేరు, మిగిలిన రాష్ట్రాలతోబాటు వ్రాశారనీ, కాని, 21-2-1948 న ప్రకటితమైన రెండవ ముసాయిదాలో ఆ పేరు వదిలిపెట్టేశారనీ వ్రాశాను. ఆలాగు వదిలిపెట్టడానికి, రాష్ట్రం ప్రత్యేకంగా కార్యనిర్వహణ జరుపు కోవలెనంటే, కొన్ని పనులు ముందుగా జరగవలెనని కారణాలు చెప్పారు. 1947 లో అమలులోఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు ప్రకారం క్రొత్త రాష్ట్రంయొక్క యంత్రాంగం సిద్ధం చేసుకొని