పుట:Naajeevitayatrat021599mbp.pdf/780

ఈ పుట ఆమోదించబడ్డది

అని ఎరువులు గవర్నమెంట్ గొడౌనులలో కొనుక్కునేకుందుకు వీలు కల్గించారు. ఇటువంటి లాభం స్వయంగా ధాన్యం పండించి, ధాన్యం అప్పజెప్పే రైతులకే చెందవలెనని ఆదేశము. ఈ ఆదేశం ప్రకారం రైతులు బోనస్ చీట్లను సంపూర్ణంగా వినియోగించుకొనే సమయం రాకుండానే ప్రకాశంగారి మంత్రివర్గం పతన మయింది.

క్రొత్త మంత్రి వర్గంలోని వేముల కూర్మయ్యగారు, ప్రకాశంగారి మంత్రి వర్గంలోనూ ఉండిన వారే. పడత్రోసిన వారితో ఏకం కావడంవల్ల క్రొత్త మంత్రి వర్గంలో కూడా ఆయన మరల మంత్రి అయ్యారు.

విజయవాడలో, ఆయనకు సన్నిహితుడైన ఒక హోటలు ఖామందు ఉండేవాడు. ఆయన అమాయికులైన రైతులదగ్గర వందలకొద్ది టన్నుల ఎరువులు తేలిగిన బోనస్ చీటీలను సంపాదించాడు. అగ్రికల్చరల్ ఆఫీసరు దగ్గిరికి వెళ్ళి, ఈ బోనస్ చీటీలన్నీ చూపించే సరికి, ఆ ఆఫీసర్ ఆ చీటీలకు కావలసిన ఎరువు విజయవాడ గొడౌన్లలో లేదనీ, చాలా గొడౌన్లనుంచి సేకరించినా సరిపోదని అభిప్రాయ పడ్డాడు.

ఆఫీసర్ అనవసరంగా ఆలస్యం చేస్తున్నాడని, ఆ హోటలు ఖామందు కూర్మయ్యగారితో చెన్నపట్నానికి వచ్చి చెప్పారు. ఆయన వ్యవసాయ శాఖామంత్రి అయిన మాధవమేనోన్ గారిచేత - హోటలు ఖామందుకు ఆయన ఇచ్చే బోనస్ చీటీలనుబట్టి కావలసినంత ఎరువులు ఈయవలసిందనే ఆదేశం వ్రాయించి, ఒక కాపీ ఆయన చేతిలోనే పెట్టి పంపారు.

ఒక్కొక్క రైతుకు నిర్ణీతమైన బరువుగల ఎరువులకు మించి ఇవ్వరాదనే నిషేధం ఉండడంవల్ల, ఎంతమంది రైతుల పేర్లు కావలెనో అంతమంది పేర్లతో ఆయన అంతకు ముందే ఒక పట్టీ దాఖలు చేసి ఉన్నాడు. ఆ పట్టీ నిజమనదో, అబద్ధమైనదో చూసిన వాడెవడూ లేడు.

ఆ హోటలు ఖామందు తాను రైతు కాకపోయినా, వందలకొద్ది