పుట:Naajeevitayatrat021599mbp.pdf/778

ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రులపై ఛార్జీలు

ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలోనే - బెజవాడ గోపాలరెడ్డిగారు, వారి కుటుంబంలో మరొక అయిదారుగురు, వారికి కొంత దూరపు బంధువులయిన ఇద్దరు కలిసి ఒక ప్రైవేటు కంపెనీగా ఏర్పడి, స్టేట్ ఎయిడ్ టు ఇండస్ట్రీస్ ఆక్టు క్రింద పది లక్షలు అప్పు ఇవ్వవలసిందని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీసుకు అర్జీ పెట్టుకొన్నారు. వారు చేయదలచుకొన్నది - వేరుశనగనూనె తీయడానికి ఒక మిల్లు స్థాపించడము.

ఆ మిల్లు పేరు సుదర్శన ఆయిల్ మిల్సు.

ఆ శాసనం క్రింద ఇటువంటి ఋణాలు ఇవ్వడానికి వీలులేదని వారు నిరాకరించారు. దానిపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారిని ఋణము కోరగా వారూ నిరాకరించారు. ఆ తర్వాత ఆ ఋణం ఇవ్వవలసిందని వారు ప్రభుత్వానికే అర్జీ దాఖలు చేసుకొన్నారు. ఇంతలో, ప్రకాశంగారి మంత్రివర్గం పతనమయింది.

తర్వాత, గోపాలరెడ్డిగారు ఆర్థిక మంత్రి అయ్యారు. బళ్ళారి నుంచి వచ్చిన హెచ్. సీతారామరెడ్డి అనే శాసన సభ్యులు పారిశ్రామిక శాఖా మంత్రి అయ్యారు. వారు తమ యాజమాన్యం క్రింద నడిచే ఒక మిల్లుకు ఆరు లక్షలు కావాలని అర్జీ పెట్టుకోగా, ఆర్థిక మంత్రిగా గోపాలరెడ్డిగారు దానిని ఆమోదించి డబ్బు మంజూరు చేశారు.

పారిశ్రామిక శాఖా మంత్రి అయిన సీతారామరెడ్డిగారు అంతకు ముందు పదిలక్షల రూపాయలకోసం గోపాలరెడ్డిగారు పెట్టుకొన్న దరఖాస్తుపై డబ్బు మంజూరు చేయడం అర్హమేనని సిఫారసు చేశారు. ఆర్థిక మంత్రిగారు తమ దరఖాస్తుపై డబ్బు మంజూరు చేసుకొన్నారు.

ఆ సంవత్సరంలో స్టేట్ ఎయిడ్ టు ఇండస్ట్రీస్ ఆక్టు క్రింద ఋణాలు ఇవ్వడానికి కేటాయించిన సొమ్ము యాభైవేల రూపాయలు మాత్రమే. లక్షకు మించి క్రొత్తగా వ్యయం చేయవలసి ఉంటే, ఫైనాన్స్ కమిటీ అనే ఉప సంఘం ముందు, వాటికి సంబంధించిన దరఖాస్తులు విచారణకై వెళ్ళాలి. అయితే, శాంక్షన్ అయిన ఈ దర